వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 మాసాలుగా స్పీడ్‌లో జియోనే టాప్

రిలయన్స్ జియో డేటా స్పీడ్‌లో తన హవా కొనసాగిస్తోంది. అత్యధిక సగటు డేటా స్పీడులో వరుసగా ఏడు మాసాల నుండి జియోనే టాప్‌లో కొనసాగుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో డేటా స్పీడ్‌లో తన హవా కొనసాగిస్తోంది. అత్యధిక సగటు డేటా స్పీడులో వరుసగా ఏడు మాసాల నుండి జియోనే టాప్‌లో కొనసాగుతోంది.

టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మంగళవారం నాడు విడుదల చేసింది. డేటాలో జూలైలో రిలయన్స్ టాప్‌లో నిలిచింది. జియో తన సర్వీసులను ప్రారంభించి జూలైకు ఏడాది పూర్తైంది.

Reliance Jio tops TRAI's average monthly speed test chart for July

ఇతర టెలికం కంపెనీలకు జియో చుక్కలను చూపించింది. ఏడు మాసాలుగా భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూలార్‌లకు ఎక్కడ కూడ అవకాశం కల్పించలేదు.

జియోనే ట్రాయ్ స్పీడ్ చార్ట్‌ల్లో అగ్రగామిగా నిలిచింది. జూలైలో జియో సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 18.331 ఎంబిపీఎస్, ఎయిర్‌టెల్ స్పీడ్ 9.266ఎంబిపీఎస్, ఐడియా సెల్యూలార్ స్పీడ్ 8.833 ఎంబీపీఎస్, వోడాఫోన్ ఇండియా స్పీడ్ 9.325 ఎంబీపీఎస్ అని తెలిపింది.

ఈ ఏడాదిలో భారత్‌లో నెలకు 20 కోట్ల జీబీ నుండి 150 కోట్ల జీబీకి పెరిగింది. దీనిలో జియోకు నెలకు 100 కోట్ల జీబీ డేటాపైనే నమోదౌతోంది. ఇతర టెలికం కంపెనీల కంటే ఐదింతలు ఎక్కువ డేటాను జియో అందిస్తోంది.

2016 సెప్టెంబర్ 5నుండి మొత్తం 22 సర్వీస్ ప్రాంతాల్లో జియో తన వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్ సర్వీసులను ప్రారంభించింది.

English summary
Reliance Jio clocked the highest average data speed for the month of July, data released by the Telecom Regulatory Authority of India (TRAI) on Tuesday showed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X