"వ్యభిచారాన్ని చట్టబద్దం చేస్తే రేప్‌లు ఆగుతాయి"

కర్ణాటకలోని ధార్వాడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పీఠాధిపతి పాల్గొని మాట్లాడారు. కొందరు మహిళలు తమ రక్షణ కోసం ఉన్న చట్టాలను ఆసరాగా చేసుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడతున్నారని మహాదేవి విమర్శించారు. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే అత్యాచారాలు తగ్గుతాయని కూడా సెలవిచ్చారీ మాతే శ్రీ.
ఈ మేరకు ఆమె కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. తన సూచనలపై ప్రభుత్వాన్ని ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలపై కర్ణాటకలో మహిళా, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మహాదేవి వ్యాఖ్యలు మహిళలను, వారి వస్త్రధారణను అవమానపరిచేలా ఉన్నాయని నిరసన వ్యక్తం చేశాయి. కర్ణాటకలో జగద్గురు మహాదేవిగా ప్రసిద్ధికెక్కిన ఈ బసవధర్మ పీఠాధిపతిని అక్కడి లింగాయత్ వర్గీయులు విశేషంగా ఆరాధిస్తారు. మతే మహాదేవి లింగాయత్‌ల ఏకైక మహిళా జగద్గురు.
మహిళలు, ముఖ్యంగా అమ్మాయిలు పాశ్చాత్య వస్త్రధారణకు స్వస్తి చెప్పాలని ఆమె సూచించారు. సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే దుస్తులు ధరించాలని ఆమె అన్నారు. యువతరంలో సంప్రదాయ విలువల డొల్లతనం చోటు చేసుకుందని అన్నారు.












Click it and Unblock the Notifications