ప్రధానికి-కాంగ్రెస్‌కు అంత తేడా ఉంది: కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని కొలరాస్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన హిందీ సామెతను ఉపయోగించారు. 'ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కాంగ్రెస్‌ నాయకులకు మధ్య చాలా తేడా ఉంది. అది గడ్డం వద్ద ఉన్న వెంట్రుకులకు - తోక వద్ద ఉన్న వెంట్రుకలకు ఎంత తేడా ఉంటుందో, అంత తేడా ఉంది' అని వ్యాఖ్యానించారు.

Remarks by Union Minister Narendra Singh Tomar upsets Congress

తాను ఏ నాయకుడిని ఉద్దేశించి చేయలేదని, ప్రధానికి, కాంగ్రెస్‌ నాయకులకు మధ్య ఉన్న తేడాను మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఎంతోమంది సమర్థులు ఉన్నా, వారసత్వ రాజకీయాల కారణంగా వారు పార్టీ అధ్యక్షులు కాలేరన్నారు. ఆ పదవి ఒక్క కుటుంబానికే పరిమితమన్నారు. బీజేపీలో ఎవరైనా పార్టీ అధ్యక్షుడు కావచ్చన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Invoking a Hindi phrase, Union Minister Narendra Singh Tomar has said Prime Minister Narendra Modi and Congress leaders were as different as “the hair on a moustache and that on a tail”.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి