ఛీకొట్టినా బుద్ధి రాలేదు: స్టాలిన్‌పై పన్నీరుసెల్వం ఆగ్రహం

ప్రభుత్వ కార్యాలయాల్లో దివంగత జయలలిత చిత్రపటాలను తొలగించాలని, అలాగే అమ్మ పథకాలను కొత్తగా తీసుకు రావొద్దన్న ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ పైన మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెన్నై: ప్రభుత్వ కార్యాలయాల్లో దివంగత జయలలిత చిత్రపటాలను తొలగించాలని, అలాగే అమ్మ పథకాలను కొత్తగా తీసుకు రావొద్దన్న ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ పైన మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆఫీసుల్లో జయలలిత చిత్రపటాలను తొలగించాలని డిమాండ్‌ చేసిన డీఎంకే తీరును పన్నీరు సెల్వం ఖండించారు. రాజకీయ దురుద్దేశంతోనే డీఎంకే ఆందోళన చేస్తోందని ఆరోపించారు.

ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన జయలలిత చిత్రాలను తొలగిస్తే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జయలలిత చిత్రాలను కార్యాలయాల నుంచి తొలగించగలరేమో కానీ, ప్రజల మనస్సుల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

Removing Jaya's portraits will not remove her from people's hearts: OPS

స్టాలిన్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ను కలిసి వినతి పత్రం అందించిన అనంతరం పన్నీరు సెల్వం స్పందించారు. వరుసగా రెండుసార్లు ప్రజలు తిరస్కరించినా డీఎంకే నేతలకు బుద్ధి రాలేదన్నారు.

ప్రజలకు ఉపయోగపడే పనులను చేయాలని పన్నీరుసెల్వం సూచించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత ఎన్నో ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టారని, ప్రజల గుండెల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

కరుణానిధి బాటలోనే ఆయన తనయుడు స్టాలిన్‌ నడుస్తున్నారని పన్నీరు సెల్వం విమర్శించారు. కామరాజ్‌, ఇందిరాగాంధీ, రాజగోపాలాచారి, ఎమ్జీఆర్‌లపై కూడా డీఎంకే నాయకులు అసందర్భ వ్యాఖ్యలు చేశారని, అయినప్పటికీ వారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పన్నీరు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+