Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరోసారి పెద్దనోట్ల రద్దు తప్పదా, ఎన్నికల వేళ షాక్ - ఏం జరుగుతోంది..!?

కేంద్రంలో భారీ నిర్ణయాలకు రంగం సిద్దం అవుతోంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ద్వారా సంచలన అంశాలను ప్రతిపాదించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జమిలి, మహిళా బిల్లు వంటి వాటితో పాటుగా దేశం పేరు ఇక భారత్ గా ఖరారు చేస్తూ నిర్ణయం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇండియా పేరుతో నిర్వహిస్తున్న అన్ని పేర్లు భారత్ గా మారనున్నాయి. ఈ కారణంతో పెద్ద నోట్లు రద్దు అంశం సాంకేతికంగా తెర మీదకు వచ్చింది.

కేంద్రం సంచలన నిర్ణయాలు:పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సంచలన నిర్ణయాలు ఖాయమని తెలుస్తోంది. రాజకీయంగా తమకు అనుకూల నిర్ణయాల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా జమిలి ఎన్నికల పైన చర్చకు కేంద్రం తెర లేపింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తో కమిటీ ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికలు..ముందస్తు అంటూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. లోక్ సభతో పాటుగా 12 రాష్ట్రాల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో మహిళా బిల్లుతో పాటుగా మరో కీలక నిర్ణయానికి ఆమోదం తెలపనుంది. ఇండియా స్థానం లో ఇక భారత్ పేరుతోనే అన్ని అమలయ్యేలా నిర్ణయానికి సిద్దమైంది.

Renaming India: Will Bharat Also Bring an End to High-Denomination Currency

ఇండియా స్థానంలో భారత్:ఇక, భారత్ పేరుతో అన్ని వ్యవహారాలు జరిగేలా ఇప్పటికే కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇండియా పేరుతో కొనసాగుతున్న అన్ని సంస్థలు, బ్యాంకుల పేర్లు మార్పు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..ఇక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ గా మార్చాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య ఉంది. ఆర్బీఐ జారీ చేసిన అన్ని కరెన్సీ నోట్ల పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు ఉంటుంది. మరి..

భారత్ పేరు మార్పు సమయంలో కరెన్సీ నోట్ల విషయంలో ఏం చేస్తారనేది సామాన్యుల్లో టెన్షన్ కు కారణమవుతోంది. కరెన్సీ నోట్ల వరకు మినహాయింపు ఇస్తారా.. లేక వాటిని రద్దు చేస్తూ..వాటి స్థానంలో కొత్తవి ప్రజలకు అందుబాటులోకి తెస్తారా అనే చర్చ సామాన్యుల్లో మొదలైంది.

Renaming India: Will Bharat Also Bring an End to High-Denomination Currency

కరెన్సీ నోట్లను ఏం చేస్తారు:2016లో కేంద్రం పెద్ద నోట్ల రద్దు చేసిన సమయంలో ఎదురైన ఇబ్బందులు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. అదే విధంగా రూ 2000 నోటును కేంద్రం ఉప సంహరించుకుంది. సామాన్యులు కేంద్రం నిర్ణయాలకు ఇబ్బందులు ఎదురైనా మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో సామాన్యులపైన ప్రభావం పడే నిర్ణయాలు ఉండవనే ప్రచారం సాగుతోంది. రాజకీయంగా మాత్రం కరెన్సీ విషయంలో కొత్తగా తెచ్చే ప్రతిపాదనలు ఎలా ఉంటానే ఆసక్తి కనిపిస్తోంది.

ప్రజల వద్ద ఆర్బీఐ పేరుతో నోట్లును క్రమేణా మార్చుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ గా మార్చుకొనే వెసులుబాటు కల్పిస్తుందని..దీనికి సుదీర్ఘ కార్యాచరణ ప్రకటిస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఈ వ్యవహారంలో స్పష్టత ఇచ్చే వరకు ఉత్కంఠ తప్పేలా లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+