వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం ఫాంహౌస్‌కు రిపబ్లిక్ టీవీ జర్నలిస్టులు: గార్డును దూషించారంటూ అరెస్టు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఫాంహౌస్ సెక్యూరిటీ గార్డును దూషించారనే ఆరోపణలతో ఇద్దరు రిపబ్లిక్ టీవీ జర్నలిస్టులతోపాటు వారి డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతిక్రమణకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. రాయ్‌గర్‌లోని ఖాలాపూర్‌ మోఝే భిల్వాలే గ్రామంలో సీఎం ఉద్ధవ్ ఫాంహౌస్ ఉంది.

అరెస్ట్ చేసి కస్టడీకి.. ఐడీలు దొరికాయి కానీ.. వారు జర్నలిస్టులేనా?

అరెస్ట్ చేసి కస్టడీకి.. ఐడీలు దొరికాయి కానీ.. వారు జర్నలిస్టులేనా?

నేవీ ముంబైలోని హైవేపై వెళుతుండగా.. రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ అనూజ్ శర్మ, కెమెరాపర్సన్ యష్పాల్ జిత్ సింగ్, వారి ఓలా క్యాబ్ డ్రైవర్ ప్రదీప్ ధనవాడెలను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని రాయగడ్ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఖాలాపూర్ కోర్టులో బుధవారం ప్రవేశపెట్టగా.. ఐదురోజుల పోలీస్ కస్టడీ విధించింది.
జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారని మీడియా ప్రశ్నించగా.. రాయగడ్ పోలీసులు స్పందిస్తూ.. ‘వారు జర్నలిస్టులు అవునో కాదో మాకు తెలియదు. మేము వారి వద్ద ఐడెంటీ కార్డులను గుర్తించినప్పటికీ.. వాస్తవంగా వారు రిపోర్టర్లో కాదు తెలియదు' అని చెప్పడం గమనార్హం.

వాచ్‌మన్‌ను దూషించి, దాడికి యత్నమంటూ..

వాచ్‌మన్‌ను దూషించి, దాడికి యత్నమంటూ..

ముఖ్యమంత్రి ఫాంహౌస్ వాచ్‍‌మన్ ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి సీఎం ఫాంహౌస్ ఎక్కడా? అంటూ వారు వచ్చారని, అనుమానం రావడంతో వాచ్‌మన్ పోలీసులకు ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు. అంతేగాక, ఫాంహౌస్ అడ్రస్ ఎందుకు చెప్పవంటూ వాచ్‌మన్‌ను దూషించారని, దాడికి యత్నించారని పోలీసులు తెలిపారు.

రిపబ్లిక్ టీవీపై మహా సర్కారు కుట్ర?

రిపబ్లిక్ టీవీపై మహా సర్కారు కుట్ర?

కాగా, తమ ప్రతినిధులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రిపబ్లిక్ టీవీ యాజమాన్యం ఆరోపించింది. జర్నలిస్టులు తమ విధుల్లో భాగంగానే అక్కడికి వెళ్లారని, అంత మాత్రానికే అరెస్ట్ చేసి ఏం సందేశం ఇస్తున్నారని మహారాష్ట్ర సర్కారుకుపై మండిపడింది. రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్‌ను బ్లాక్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారా? అని ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగానే సర్కారు ఈ విధంగా తమ జర్నలిస్టులను వేధిస్తోందని ఆరోపించింది. దీనిపై తగిన విధంగా స్పందిస్తామనిపేర్కొంది.

English summary
Two Republic TV journalists and their driver were arrested Tuesday night for allegedly abusing a security guard at Maharashtra Chief Minister Uddhav Thackrey's farmhouse at Mojhe Bhilwale village, Khalapur, Raigar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X