బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పేలుడు, రీసెర్చర్ మృతి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన సిలిండర్ పేలుడులో ఓ రీసెర్చర్ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఇనిస్టిట్యూట్‌లో ఉన్న ఏరో స్పేస్ ల్యాబ్‌లో ఈ పేలుడు చోటు చేసుకుంది.

ల్యాబ్‌లో హైడ్రోజన్ సిలిండర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం 2.20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ఓ రీసెర్చర్ మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Researcher dies in lab explosion at Indian Institute of Science in Bengaluru

ఐఐఎస్‌సీకి అనుబంధంగా పనిచేస్తున్న సూపర్‌వేవ్ టెక్నాలజీ ప్రయివేటు లిమిటెడ్ అనే కంపెనీకి చెందిన రీసెర్చర్లు ఏరో స్పేస్ ల్యాబ్‌లో పని చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది.

మధ్యాహ్నం గం.2.20 నిమిషాలకు ఈ పేలుడు సంభవించిందని, దీని ధాటికి ఈ రీసెర్చర్ 20 అడుగుల దూరంలో పడి చనిపోయాడని, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక్కడ ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు.

English summary
A 32 year old researcher has died and three others are critically injured after an explosion at the Indian Institute of Science in Bengaluru or IISc. A hydrogen cylinder is suspected to have exploded at the aerospace lab in the institute around 2:20 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X