Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా, అంగీకరిస్తున్నా: సస్పెన్షన్‌పై తొలిసారి స్పందించిన నుపుర్ శర్మ

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తగా సస్పెండ్ చేయబడిన కొన్ని రోజుల తరువాత.. నుపుర్ శర్మ మంగళవారం మొదటిసారిగా స్పందించారు. పార్టీ నిర్ణయాన్ని తాను "అంగీకరించి గౌరవిస్తున్నాను" అని అన్నారు. కాషాయ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది. ఢిల్లీ యూనిట్ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ను బహిష్కరించింది. వారి ఆరోపణ వ్యాఖ్యలపై కొన్ని ముస్లిం దేశాల నుంచి నిరసనలు పెరగడంతో ఆయనను బహిష్కరించారు.

ఆమెపై బీజేపీ చర్యపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు శర్మ స్పందిస్తూ.. "నేను ఆచరణాత్మకంగా సంస్థలో పెరిగాను, నేను వారి నిర్ణయాన్ని గౌరవిస్తాను, అంగీకరిస్తున్నాను' అని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, కాషాయ పార్టీ ఈ వివాదానికి దూరంగా ఉండి, అన్ని మతాలను గౌరవిస్తుందని, ఏదైనా మతపరమైన వ్యక్తిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, చంపుతామంటూ బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో నుపుర్ శర్మకు పోలీసులు భద్రత కల్పించారు.

 Respect and Accept BJPs Decision: Nupur Sharma On Suspension From BJP Over Prophet Controversy

నుపుర్ శర్మకు సమన్లు జారీ చేసిన మహారాష్ట్ర పోలీసులు

ముహమ్మద్ ప్రవక్త , ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను సస్పెండ్ చేసి, నవీన్ జిందాల్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల తరువాత నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ముంబ్రా పోలీసులు మంగళవారం జూన్ 22న శర్మను హాజరుకావాలని సూచించారు.

మే నెలాఖరున జరిగిన టెలివిజన్ చర్చలో ఇస్లాం వ్యతిరేక వ్యాఖ్యలకు గానూ శర్మను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆమెను న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీకి నిలబెట్టింది. ఆమె ఓడిపోయింది.

అదే సమయంలో, ప్రవక్త గురించి రెచ్చగొట్టే ట్వీట్లకు ఢిల్లీలోని పార్టీ మీడియా విభాగానికి నేతృత్వం వహిస్తున్న నవీన్ కుమార్ జిందాల్‌ను బీజేపీ ఢిల్లీ యూనిట్ బహిష్కరించింది.

బేషరతుగా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న నూపుర్ శర్మ

ఇటీవల టీవీ చర్చలో ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నూపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో నూపుర్ శర్మ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతోపాటు క్షమాపణలు కూడా చెప్పారు.

'నా మాటలు ఎవరికైనా అసౌకర్యాన్ని కలిగించినా లేదా ఎవరికైనా మతపరమైన భావాలను గాయపరిచినట్లయితే, నేను బేషరతుగా నా ప్రకటనను ఉపసంహరించుకుంటాను. ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయడం నా ఉద్దేశ్యం కాదు' అని నూపుర్ శర్మ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

'గత చాలా రోజులుగా మా మహాదేవ్‌ను అవమానిస్తున్నారని, అగౌరవపరిచారని నేను టీవీ చర్చలకు హాజరవుతున్నాను. ఇది శివలింగం కాదు [జ్ఞానవాపి మసీదు వద్ద] ఫౌంటెన్ అని ఎగతాళిగా చెబున్నారు. ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న గుర్తులు, స్తంభాలతో పోల్చడం ద్వారా కూడా ఎగతాళి చేస్తున్నారు' అని నూపుర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

'మా మహాదేవ్‌పై ఈ నిరంతర అవమానాన్ని, అగౌరవాన్ని నేను సహించలేకపోయాను. దానికి ప్రతిస్పందిస్తూ నేను కొన్ని విషయాలు చెప్పాను' అని నూపుర్ శర్మ తెలిపారు.

బీజేపీ నుంచి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ సస్పెండ్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదివారం నాడు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. మహమ్మద్ ప్రవక్త ‌పై శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు బీజేపీ సంబంధం లేదని ప్రకటించిన అనంతరం ఈ మేరకు చర్య తీసుకుంది. ఏ వర్గాన్ని లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే భావజాలానికి పార్టీ తీవ్రంగా వ్యతిరేకమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాంటి వ్యక్తులకు లేదా సిద్ధాంతాలకు బీజేపీ మద్దతు ఇవ్వదని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని ఆచరించడానికి, ప్రతి మతాన్ని గౌరవించే హక్కును కల్పించిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+