వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా వృత్తిని గౌరవించండి... మీ గొడవల్లోకి లాగొద్దు ప్లీజ్: 'చౌకీదార్' వివాదంపై వాచ్‌మెన్లు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయపార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి సోషల్ మీడియాలో చౌకీదార్ అనే పదం చాలా ట్రెండ్ అవుతోంది. ఇందుకు కారణం తాను దేశానికి కాపాలాదారుడునని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విటర్ ప్రొఫైల్‌కు చౌకీదార్ అనే పదాన్ని కలుపుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు ఇతర బీజేపీ కార్యకర్తలు కూడా తమ ప్రొఫైల్‌కు ముందు చౌకీదార్ అనే పదాన్ని తగిలించుకోవడంతో ఈ పేరు ట్రెండ్ అయ్యింది. చౌకీదార్ అనే ఈ పదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా విమర్శలు ఎక్కు పెట్టారు. చౌకీదార్ చోర్ హై అంటే కాపలాదారుడు దొంగగా మారాడంటూ తన ప్రసంగాల్లో మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాదు దేశం మొత్తాన్ని మోడీ కాపలాదారులను చేశాడని మండిపడ్డారు.

Respect our profession, dont drag us in your fight: Real chowkidars object to PM Modi campaign

చౌకీదార్‌ అనే పదం ఇటు అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది.ఇద్దరూ నేతలు చౌకీదార్ అనే పదంపై మాటల యుద్ధానికి దిగుతుండటంతో అసలైన చౌకీదార్లు స్పందించారు. మీ రాజకీయ స్వలాభం కోసం చౌకీదార్ అనే పదాన్ని వినియోగించుకోకండి అంటూ వాచ్‌మెన్లు చెబుతున్నారు. రోజు మోడీ, రాహుల్ గాంధీలో చౌకీదార్‌ పదంపై మాటల యుద్ధాలకు దిగుతుంటే ఆ పదం ఓ తిట్టులా తయారవుతోందని వాచ్‌మెన్లు అంటున్నారు.

భారత తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పీసీ ఘోష్...ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్భారత తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పీసీ ఘోష్...ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

రాహుల్ గాంధీ చౌకీదార్ అనే పదానికి ఉన్న విలువను తీసేస్తుండగా ప్రధాని నరేంద్ర మోడీ చౌకీదార్ల కోసం ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. రోజుకు 12 గంటల పాటు సెలవు లేకుండా పనిచేసే ఒకే ఒక వ్యక్తి చౌకీదార్ అని వాచ్‌మెన్లు చెబుతున్నారు.చాలా మంది చౌకీదార్లు కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వారికి వారి ఉద్యోగాలకు ఎలాంటి భరోసా లేదని రత్తిలాల్ అనే చౌకీదార్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రింబవళ్లు పనిచేస్తారని ప్రమాదకరమైన చోట్ల కూడా పనిచేసేది ఒక్క చౌకీదారే అని చెప్పాడు రత్తిలాల్. ఆరోగ్యపరంగా ఎలాంటి భరోసా లేదని చెప్పిన రత్తిలాల్ తమకు పెన్షన్ స్కీము కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చౌకీదార్ దొంగ అని రాహుల్ గాంధీ ఇచ్చిన స్లోగన్‌తో చాలామంది ఆ స్లోగన్‌ను తమపై ప్రయోగిస్తుంటే బాధ కలుగుతోందని రత్తిలాల్ చెప్పాడు.

తాము ఎలాంటి కష్టమైన జీవితాలను గడుపుతున్నామో పదవిలో ఉన్న ప్రధాని ఇతర బీజేపీ నాయకులకు తెలియదన్నారు. వారు అసలు తమ బతుకులను ఊహించలేరన్నాడు రత్తిలాల్. అందరి భద్రత చూసే చౌకీదార్ తన జీవితానికే భద్రత లేకుండా పోతోందని రత్తిలాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన జీవితమంతా చౌకీదార్‌గా పనిచేసిన మరో వ్యక్తి బనిసింగ్... తాను ఎంతో నిజాయితీగా బతికినట్లు వెల్లడించాడు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇస్తున్న స్లోగన్ చౌకీదార్ చోర్ అనేది తన మనస్సును గాయపరుస్తోందని చెప్పాడు. అయితే రాజకీయ నాయకులు తాము చేస్తున్న యుద్ధాన్ని తమ వరకే పరిమితం చేసుకోవాలని చౌకీదార్లను ఇందులోకి లాగరాదని హితవు పలికాడు బనిసింగ్ అనే వాచ్‌మెన్.

English summary
As the country is gearing up for Lok Sabha elections, Rahul Gandhi's slogan 'Chowkidar Chor Hai' seems to have finally struck a nerve in the Bharatiya Janata Party (BJP).people, especially those from the lower rungs of the economic ladder, criticised Modi and Rahul for making the word 'Chowkidar' sound like abuse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X