ఎలుకలు.. కాదు కాదు పెట్స్: ఇదేందయ్యా ఇది!
చాలా మంది ఇటీవల కాలంలో బయటకు వెళ్లి రెస్టారెంట్‌లో ఇష్టమైన ఫుడ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. రెస్టారెంట్లలో రిచ్ లుక్, అదిరిపోయే అంబియన్స్, కాస్ట్లీగా కనిపించగానే.క్వాలిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అందరు అనుకుంటారు కస్టమర్స్. కానీ, ఇలా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే! భోజనంలో బల్లులు, పాములు, పురుగులు బయటపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా సామాన్య ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ దారుణమైన ఘటనలో, రెస్టారెంట్ వంటగది అపరిశుభ్రతకు పరాకాష్ఠగా నిలిచింది. కీటకాలు, ఈగలు, ఏకంగా ఎలుకలు ఆహారం మధ్య తిరుగుతుండగా.. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆకస్మిక దాడి: బుందేల్‌ఖండ్ హాస్పిటల్ ఎదురుగా దారుణం
మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరంలో ఉన్న బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎదురుగా గల రాశి రెస్టారెంట్ కలుషిత ఆహారానికి, అపరిశుభ్రతకు నిదర్శనంగా నిలిచింది. ఆహార శాఖ బృందం ఈ రెస్టారెంట్‌పై ఆకస్మిక దాడి చేయగా.. లోపల ఉన్న వాతావరణం చూసి అధికారులు అవాక్కయ్యారు. రెస్టారెంట్ వంటగదిలోకి ప్రవేశించగానే అధికారులకు తీవ్రమైన దుర్వాసన ఎదురైంది.వంటగది గోడలు పూర్తిగా నూనె జిడ్డుతో నిండిపోయి, చూడటానికి కూడా అసహ్యంగా ఉన్నాయి.

ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు షాకింగ్ సమాధానం
ఆహార పదార్థాలు వండే ప్రదేశంలో, వంట సామాగ్రి మధ్యలో కీటకాలు, ఈగలతో పాటు ఏకంగా పెద్ద పెద్ద ఎలుకలు కూడా స్వేచ్ఛగా తిరుగుతుండటం అధికారుల కంట పడింది. వంటగదిలో తిరుగుతున్న ఎలుకల గురించి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రీతి రాయ్ రెస్టారెంట్ యజమానిని గట్టిగా ప్రశ్నించారు. ఈ సమయంలో యజమాని ఇచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురిచేసింది. యజమాని స్పందిస్తూ.. "మేడం, ఈ ఎలుకలు మా పెంపుడు జంతువులు (Pets). ఇవి ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి" అని చెప్పడం విన్న అధికారులు నివ్వెరపోయారు. ఆహార తయారీ కేంద్రంలో ఎలుకలు ఉండటాన్ని సాధారణంగా, పెంపుడు జంతువుల తరహాలో చెప్పడం అతని బాధ్యతారాహిత్యాన్ని వెల్లడించింది.
అక్రమ గ్యాస్ సిలిండర్ వినియోగం
పరిశుభ్రత లేకపోవడంతో పాటు రెస్టారెంట్ యజమాని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు కూడా దర్యాప్తులో తేలింది. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించాల్సిన గ్యాస్ సిలిండర్ల స్థానంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై అడిగినప్పుడు, యజమాని "రీఫిల్లింగ్ కోసం తెచ్చాను" అని వివరణ ఇచ్చారు.
కఠిన చర్యలు.. హెచ్చరిక
పరిస్థితిని దర్యాప్తు అధికారులు తీవ్రంగా పరిగణించారు. రెస్టారెంట్‌ను తక్షణమే సీల్ చేయాలని ఆదేశించారు. వంటగది నుంచి ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపారు. పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత యజమానిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. రెస్టారెంట్ యజమానిని ఏడు రోజుల్లోగా వంటగదిలోని లోపాలను, అపరిశుభ్రతను పూర్తిగా సరిదిద్దాలని ఆదేశించారు. ఈ ఆకస్మిక దాడి సాగర్ నగరంలోని ఇతర హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులలో తీవ్ర ఆందోళన కలిగించింది. పరిశుభ్రతా నియమాలను కచ్చితంగా పాటించని పక్షంలో లైసెన్స్‌లు రద్దు చేయబడతాయని ఆహార శాఖ కఠినంగా హెచ్చరించింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications