వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకులో పనిచేశాడు, పెద్ద నగదు నోట్ల రద్దుతో ఏం చేశాడంటే

పెద్ద నగదు నోట్ల రద్దుతో రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. ముకుట్ బాపట్ అనే వ్యక్తి ఎస్ బి ఐ లో క్యాషియర్ గా పనిచేస్తూ ఇటీవలే విఆర్ఎస్ తీసుకొన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబాయి: పెద్ద నగదు నోట్ల రద్దు ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ప్రాణాలు తీసింది. ఇటీవలనే ఆయన బ్యాంకు ఉద్యోగం నుండి స్వచ్చంధంగా(విఆర్ఎస్) వైదొలగారు. విఆర్ఎస్ తీసుకొన్న కారణంగా ఆయనకు పెద్ద మొత్తంలో నగదు లభించింది.ఈ నగదును మార్చుకోవడం విషయమై మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.

మహరాష్ట్రలోని సోనర్ ప్రాంతానికి చెందిన ముకుట్ బాపత్ ఎస్ బి ఐ లో క్యాషియర్ గా పనిచేసేవాడు. ఇటీవలనేఆయన స్వచ్చంధ ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనకు బెనిఫిట్స్ వచ్చాయి. ఈ డబ్బు అంతా రద్దు అయిన నోట్ల రూపంలోనే ఉంది.

కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో ఈ నగదును మార్చుకొనేందుకు ముకుట్ మనోవేదనకు గురయ్యాడు. పాత నగదును మార్పిడి చేసుకొనేందుకు చాలా కష్టపడాల్సి వస్తోందని వేదనకు గురయ్యాడు. ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.

విఆర్ఎస్ తీసుకొన్న తర్వాత వ్యాపారాన్ని కూడ ప్రారంభించారు. అయితే పెద్ద నగదు ను మార్చుకోవడం ఇబ్బందిగా మారిందని ఆయన మనోవేదన చెందారు. ఈ వేదన కారణంగా ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ మేరకు తన ఆత్మహత్యకు గల కారణాలను కూడ ఓ లేఖలో పొందుపర్చారు.

English summary
currency ban effect on a retired bank employee. mukut bapat retired bank employee sbi at maharastra. recently he is vrs from the bank. huge amount receive mukut retirement benifits. all of suddebn govt 500, 1000 rupee currency .difficult ot mukut for exchange currency . he committed sucide in his house
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X