Amit Shah: ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మాకాశ్మీర్‍లో ఏం జరిగిదంటే..!
జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మాకాశ్మీర్‍లో ఏం జరిగిందో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ KJS ధిల్లాన్ వివరించారు.
ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మాకాశ్మీర్‍లో ఏం జరిగిందో లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) KJS ధిల్లాన్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు 'కిత్నే ఘాజీ ఆయే కిత్నే ఘాజీ గయే'గా నిర్ణయించారు. అయితే ఈ పుస్తకం ఇంకా విడుదల కాలేదు. ఈ పుస్తకంలో జూన్ 26, 2019 న శ్రీనగర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన, జమ్మూ కాశ్మీర్ (J&K)లో ఆర్టికల్ 370ని రద్దు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

2019 సార్వత్రిక ఎన్నికలు
2019 సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం J&Kలో ఆర్టికల్ 370 రద్దు చేసి ముందడుగేసింది. అయితే ఈ ఆర్టికల్ 370 రద్దుకు ముందు భారత ప్రభుత్వం భారీ కసరత్తు చేసిందని KJS ధిల్లాన్ వివరించారు. శ్రీనగర్‌కు చెందిన XV కార్ప్స్‌కు అధిపతిగా ఉన్నతనకు తెల్లవారుజామున 2 గంటలకు ఫోన్ వచ్చిందని వివరించారు. హోం మంత్రితో ఉదయం 7 గంటలకు సమావేశం కావాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

పాకిస్థాన్ స్పందన ఎలా ఉంటుంది
తమ సమావేశంలో " ఆలూ పరాటా, ప్రసిద్ధ గుజరాతీ వంటకం 'ధోక్లా'తో కూడిన రుచికరమైన ఆహారం కాకుండా చాలా సున్నితమైన, కీలక అంశాలు చర్చకు వచ్చాయి" అని రిటైర్డ్ ఆర్మీ అధికారి తన పుస్తకంలో రాశారు. 370 రద్దు చేస్తే పాకిస్థాన్ స్పందన ఎలా ఉంటుందని హోం మంత్రి అరా తీసినట్లు చెప్పుకొచ్చారు. "హోం మంత్రి సంపూర్ణ నియంత్రణలో ఉన్నారని, కచ్చితమైన ఎజెండాతో పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారని" అని KJS ధిల్లాన్ గుర్తు చేశారు.

చరిత్ర రాయాలంటే.. ఎవరో ఒకరు చరిత్ర సృష్టించాలి
అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుపై విస్తృత పరిశోధన, హోంవర్క్ చేశారని కచ్చితంగా చెప్పగలని చెప్పారు. ఈ సమావేశంలో తన అభిప్రాయన్ని అడిగారని ధిల్లాన్ చెప్పారు. చరిత్ర రాయాలంటే.. ఎవరో ఒకరు చరిత్ర సృష్టించాలని చెప్పానని ధిల్లాన్ గుర్తు చేశారు. 2019 ఆగస్టు సెషన్‌లో పార్లమెంట్ గువ సభలో (రాజ్యసభ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 బిల్లును ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

ఆగస్టు 5, 2019
రాజ్యసభలో ఎగువ సభలో బీజేపీ ఎంపీల బలం తక్కువగా ఉంది. ఇది మోడీ ప్రభుత్వానికి సవాలుగా మారింది. అయినా అమిత్ షా రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఎగువ సభలో బిల్లు ఆమోదం పొందింది. మరుసటి రోజు లోక్‌సభలో కూడా బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును పంపించారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ఆగస్టు 5, 2019న రద్దు చేయడంతో పాటు జమ్మూకాశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.












Click it and Unblock the Notifications