దత్తత తండ్రే కాటేసే కాలయముడు
నాగ్ పూర్: అభంశుభం ఎరుగని చిన్నారులను దత్తత తీసుకుని ముగ్గురు బాలికల మీద చిన్నప్పటి నుంచి లైంగిక దాడి చేస్తున్న మాజీ శాస్ర్తవేత్తను నాగ్ పూర్ పోలీసులు అరెస్టు చేశారు. దత్తత తీసుకున్న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ (ఎన్ఈఈఆర్ఐ) మాజీ శాస్త్రవేత్త మక్సూద్ అన్సారీ (75)ని నాగ్ పూర్ లోని దంతోలి పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురిలో ఎక్కువ వయస్సు ఉన్న పదహారేళ్ల బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.

ఒకటో తరగతి నుంచే తన మీద లైంగిక దాడి చేస్తున్నాడని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాని చెబుతున్నాడని బాలిక పోలీసులకు చెప్పింది. మరో బాలిక వయస్సు 11 ఏళ్లు, మరో బాలిక వయస్సు ఆరేళ్లు అని పోలీసులు చెప్పారు.
మక్సూద్ అన్సారీకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలకు పిల్లలు లేకపోవడంతో ఈ ముగ్గురిని చిన్నప్పుడే దత్తత తీసుకున్నారని పోలీసులు అన్నారు. ఇద్దరు భార్యలు ఇప్పుడు అన్సారీతో లేరని, వారిద్దరూ వేర్వేరుగా నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
బాలిక తన స్నేహితురాలి కుటుంబ సభ్యుల సహాయంతో ఓ స్వచ్చంద సంస్థను ఆశ్రయించడంతో వార్దా రోడ్డులోని అజ్నిస్క్వేర్ లో ఉండే ముగ్గురు బాలికలను రక్షించి ప్రభుత్వ ఆశ్రమానికి తరలించామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications