రేవంత్ కు రెడ్ సిగ్నల్, ఆ బీజేపీ సీఎంకు గ్రీన్ సిగ్నల్..! కేంద్రం తీరుపై విమర్శలు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) తాజాగా యూకే, యూఎస్ పర్యటనలకు కేంద్రం అనుమతి కోరారు. కానీ యూకే టూర్ కు అనుమతిచ్చిన కేంద్రం.. యూఎస్ టూర్ కు మాత్రం బ్రేక్ వేసేసింది. దీంతో ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. యూఎస్ వెళ్లకుండానే హైదరాబాద్ తిరిగి రావాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ అమెరికా టూర్ కు కేంద్రం తనకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు మాత్రం కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావడంతోనే ఆయన అమెరికా టూర్ కు అనుమతి ఇవ్వలేదంటున్నారు.
అయితే కేంద్రం మాత్రం రాజకీయ కారణాలతోనే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని తేల్చిచెప్పేసింది. అయితే ఎన్డీటీవీ మాత్రం ఇందులో మరో కోణాన్ని బయటపెట్టింది. అమెరికాలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీని కలిసేందుకు రేవంత్ రెడ్డి టీమ్ ప్లాన్ చేసుకోవడం వల్లే ఈ టూర్ కు అనుమతి ఇవ్వలేదని ఓ కథనం ప్రచురించింది. దీనిపై అటు కేంద్రం కానీ, ఇటు రేవంత్ రెడ్డి కానీ నోరు మెదపలేదు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి వచ్చాక ఈ వివాదంపై స్పందించే అవకాశం ఉంది. అయితే ఆలోపే కేంద్రం మరో ట్విస్ట్ ఇచ్చింది.

ఇటు రేవంత్ రెడ్డిని రాజకీయ కారణాలు చూపి అమెరికా పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్న కేంద్రం.. తమ పార్టీ బీజేపీకి చెందిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ను మాత్రం అక్కడికి వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. తాజాగా భూపేంద్ర పటేల్ కు విదేశాంగశాఖ ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఓవర్సీస్ కాంగ్రెస్ మండిపడుతోంది. రేవంత్ రెడ్డికి ఓ విధానం, భూపేంద్ర పటేల్ కు మరో విధానం ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిపై ఆంక్షలు విధిస్తూ బీజేపీ ముఖ్యమంత్రికి మాత్రం అమెరికా వెళ్లేందుకు అనుమతించడమే విదేశాంగవిధానమా అని కేంద్రాన్ని నిలదీస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వ ద్వంద విధానాలకు నిదర్శనమని మండిపడుతోంది.














Click it and Unblock the Notifications