అమెరికాలో ఆ ఇద్దరు వీవీఐపీలతో భేటీకి రేవంత్.. ! అందుకేనా కేంద్రం బ్రేక్ ?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తాజాగా బ్రిటన్ టూర్ కు వెళ్లారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆయన బ్రిటన్ టూర్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. ఆ తర్వాత అమెరికా టూర్ (US Tour)కు మాత్రం వెళ్లకుండా బ్రేక్ వేసేసింది. రాజకీయ కారణాలతో తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని నిన్న విదేశాంగశాఖ వివరణ ఇచ్చింది. అయితే ఆ కారణాలు ఏంటో మాత్రం బయటపెట్టలేదు. అయితే అమెరికాలో ఇద్దరు పెద్దల్ని కలిసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేయడం వల్లే ఈ టూర్ కు కేంద్రం బ్రేక్ వేసినట్లు సమాచారం.

లింగమనేని కుమారుడి యాక్సిడెంట్ కేసు-షాకింగ్ వీడియో..! తప్పించే యత్నాలు?
లింగమనేని కుమారుడి యాక్సిడెంట్ కేసు-షాకింగ్ వీడియో..! తప్పించే యత్నాలు?

బ్రిటన్ నుంచి అమెరికా వెళ్లి అక్కడ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డిని ఈ టూర్ కు వెళ్లకుండా కేంద్రం అడ్డుకున్నట్లు ఎన్టీటీవీ ఓ కథనం ప్రచురించింది. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కు రాజకీయ అనుమతిని కేంద్రం నిరాకరించడానికి ఈ ప్రతిపాదిత సమావేశాలే కీలక కారణంగా నిలిచాయని తెలుస్తోంది. అయితే అమెరికాలో వీరిద్దరినీ రేవంత్ కలవకుండా ఎందుకు అడ్డుకున్నారనే దానిపై మాత్రం కేంద్రం పూర్తి స్పష్టత ఇవ్వలేదు. సాంకేతిక కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. దీనికి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల విభేదాలు కారణం కాదంటోంది.

CM Revanth Reddy US Visit Faces Centre s Objections Over Plans to Meet JD Vance Zohran Mamdani
 అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి అందుకే ఇవ్వలేదు- రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!
అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి అందుకే ఇవ్వలేదు- రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!


సాధారణంగా మన దేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు రాజకీయ అనుమతి ఇచ్చే ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ వాటిని సమీక్షిస్తుంది. సదరు ప్రముఖులు నిర్వహిస్తున్న పదవి, పర్యటన కోసం పేర్కొన్న ఉద్దేశ్యం వంటి కారణాలను కూడా చూస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రతిపాదించిన కార్యక్రమం వారు నిర్వహిస్తున్న పదవికి, పర్యటన ఉద్దేశ్యానికి అనుగుణంగా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విషయంలో అలా లేదని తెలుస్తోంది. అందుకే రేవంత్ టూర్ కు కేంద్రం నిరాకరించినట్లు సమాచారం. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం సీఎం రేవంత్ రెడ్డికి అనుమతి ఇవ్వలేదని చెప్పినా, కారణాలు మాత్రం బహిర్గతం చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+