సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ లల్లో బెర్తులు అందుబాటులో ఉన్న రైళ్లు

దసరా, దీపావళి పండుగల సీజన్‌లో స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు వినిపించింది. రాబోయే అక్టోబర్, నవంబర్ లల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ సహా వివిధ ప్రధాన స్టేషన్ల నుంచి వివిధ మార్గాల్లో నడిపిస్తోన్న ప్రత్యేక రైళ్లల్లో సీట్ల లభ్యతకు సంబంధించిన తాజా వివరాలను వెల్లడించింది. రద్దీ ఎక్కువగా ఉండే పండుగ రోజుల్లో కూడా ఈ ప్రత్యేక రైళ్లల్లో భారీ సంఖ్యలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.

సాధారణంగా ప్రతి ఏటా పండుగల సమయంలో సాధారణ రైళ్లలో కన్ఫర్మ్డ్ రైలు టికెట్లు దొరకడం ప్రయాణికులకు ఒక పీడకలగా మారుతుంటుది. దీన్ని అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రతి సీజన్‌లోనూ ప్రత్యేక రైళ్లను నడపడం ఆనవాయితీ. వీటిల్లో అందుబాటులో ఉన్న బెర్తులు, ప్రయాణ తేదీల వివరాలను వెల్లడించింది. మంగళవారం (సెప్టెంబర్ 29) రాత్రి 8 గంటల సమయానికి ఈ ప్రత్యేక రైళ్లలో వివిధ విభాగాల్లో కన్ఫర్మ్డ్ బెర్తులు అందుబాటులో ఉంటోన్నాయి.

South Central Railway detailed availability of Berths in Special Trains during October and November
  • అక్టోబర్ 24, 31, నవంబర్ 7, 28 తేదీల్లో (ప్రతి శనివారం) హైదరాబాద్ నుంచి కొల్లం వెళ్లే నంబర్ 07193 ప్రత్యేక రైలులో 208 నుండి 212 వరకు వరకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
  • అక్టోబర్ 8, 15, 22, 29, నవంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (ప్రతి గురువారం) చర్లపల్లి నుంచి తిరువణ్ణామలై వెళ్లే 07001 ప్రత్యేక రైలులో 112 నుండి 552 వరకు బెర్తులు అందుబాటులో ఉన్నాయి.
  • అక్టోబర్ 9, 16, 19, 23, 30, నవంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి శుక్రవారం) చర్లపల్లి నుంచి సెంగొట్టై వెళ్లే 07191 ప్రత్యేక రైలులో రోజువారీ చొప్పున 543 నుండి 627 వరకు బెర్తులు అందుబాటులో ఉన్నాయి.
  • అక్టోబర్ 4, 11, 18, 25 తేదీల్లో (ప్రతి ఆదివారం) జాల్నా నుంచి యలహంక వెళ్లే 07601 ప్రత్యేక రైలులో రోజువారీ చొప్పున 730 నుండి 784 వరకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
  • అక్టోబర్ 7, 21, 28, నవంబర 4, 11, 18, 25 తేదీల్లో (ప్రతి బుధవారం) హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్లే 07097 ప్రత్యేక రైలులో రోజువారీ చొప్పున 344 నుండి 635 వరకు బెర్తులు అందుబాటులో ఉన్నాయి.
  • అక్టోబర్ 8, 15, 22, 29, నవంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (ప్రతి గురువారం) జాల్నా నుంచి తిరుపతి వెళ్లే నంబర్ 07814 ప్రత్యేక రైలులో రోజువారీ చొప్పున 340 నుండి 746 వరకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
  • అక్టోబర్ 6, 13, 20, 27, నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో (ప్రతి మంగళవారం) నాందేడ్ నుంచి తిరుచానూరు వెళ్లే నంబర్ 07603 ప్రత్యేక రైలులో రోజువారీ చొప్పున 637 నుండి 993 వరకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
  • అక్టోబర్ 5, 12, 19, 26, నవంబర్ 2, 9, 16, 24 తేదీల్లో (ప్రతి సోమవారం) చర్లపల్లి నుంచి నర్సాపూర్ వెళ్లే నంబర్ 07603 ప్రత్యేక రైలులో రోజువారీ చొప్పున 458 నుండి 470 వరకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
  • అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11, 18 తేదీల్లో (ప్రతి బుధవారం) సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్లే 07039 ప్రత్యేక రైలులో రోజువారీ చొప్పున 459 నుండి 777 వరకు బెర్తులు అందుబాటులో ఉన్నాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+