పార్టీ కార్యకర్తల కోసం జగన్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి కారణాలను సమీక్ష చేసిన జగన్ .. కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కార్యకర్తలకు ఇక ప్రాధాన్యత ఉంటుందని ప్రతీ సమావేశం లో చెబుతున్నారు. కార్యకర్తల పైన కేసుల అంశంలోనూ స్పందిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో కార్యకర్తల కోసం జగన్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆర్దికంగా అండగా నిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన చేసారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. పార్టీలో భాగస్వాములైన కార్యకర్తలు ఎవరైనా మరిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. అందు లో భాగంగా ఆర్దికంగా అందించే సాయం పైన స్పష్టత ఇచ్చారు. కష్ట కాలంలో కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం పనిచేస్తూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం అధికారికంగా వివరాలు వెల్లడించింది. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, వారి సమస్యలను పార్టీ స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

జగన్ తాజా నిర్ణయంతో
పార్టీ చేసేదికేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. కుటుంబ పెద్దను కోల్పోయిన వేళ తమ వెంటే పార్టీ ఉందనే ధైర్యాన్ని కల్పించే విధంగా పార్టీ నేతలు అండగా నిలుస్తారని వెల్లడించారు. కార్యకర్తల కష్టాన్ని గుర్తించి, వారి కుటుంబాల బాధ్యత తమదిగా భావిస్తామని పేర్కొన్నారు. పార్టీ తో పాటుగా అనుబంధ సంఘాల్లో ఉండే వారికి ఈ నిర్ణయం వర్తిస్తుంది. కష్టకాలంలో ఉన్న పార్టీ కార్య కర్త ల కుటుంబాలకు మేమున్నాం' అంటూ అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు వివరించారు. కాగా.. ఇక స్థానిక ఎన్నికల పైన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు.. నియోజక వర్గ సమన్వయ కర్తలతో జగన్ రేపు(గురువారం) కీలక సమావేశం ఏర్పాటు చేసారు. వచ్చే వారం స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. అభ్యర్ధుల ఎంపికతో పాటుగా ఎన్నికల వ్యూహాల పైన దిశా నిర్దేశం చేయనున్నారు.












Click it and Unblock the Notifications
