స్థానిక ఎన్నికల్లో TDP సీట్లు వారికే కేటాయింపు..!!
ఏపీలో స్థానిక ఎన్నికల సమరానికి రంగం సిద్దం అవుతోంది. వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. కూటమి- వైసీపీ ఇప్పటికే ఈ ఎన్నికల పైన కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కూటమిలో ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ ఎన్నికల కోసం సమన్వయ భేటీలు నిర్వహించారు. సీట్ల సర్దుబాటు పైన పవన్ చేసిన ప్రకటన తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ సీట్ల కేటాయింపు ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కీలక ప్రకటన చేసారు. ఎవరికి అవకాశం దక్కుతుందో స్పష్టత ఇచ్చారు.
స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు.. నామినేటెడ్ పదవుల పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేసారు. తమకు స్థానిక పోరు కంటే సార్వత్రిక ఎన్నికల లక్ష్యాలే ముఖ్యమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కేవలం గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్న సమర్థులైన అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఖరాకండిగా తేల్చిచెప్పారు. త్వరలో రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని ప్రకటించారు. ప్రధాని మోదీ సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ నాలుగు రాష్ట్రాల్లో బైక్ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) తిరుపతి అలిపిరి నుంచి సేవా సంకల్ప్ యాత్రను పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. స్థానిక ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని చెప్పారు.

కూటమి నేతల సమన్వయ సమావేశాలు
క్షేత్రస్థాయి నుంచి వచ్చే సిఫార్సులను ముందుగా ఎన్డీయే కోఆర్డినేషన్ కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుందని, అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంయుక్తంగా తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. మేయర్ పదవుల విషయంలో బీజేపీ, జనసేనలకు వారి డిమాండ్లు ఉన్నాయని, అభ్యర్థుల ప్రజాదరణను అంచనా వేసేందుకు ఇప్పటికే ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కూటమి భాగస్వా ములైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ తీవ్రంగా యత్నిస్తోందని ఆరోపించారు. టీడీపీ, జనసేన పేర్లతో ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి విభేదాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు నేరుగా సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని పల్లా తేల్చి చెప్పారు.













Click it and Unblock the Notifications
