అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా.. !!

కేంద్ర ఎన్నికల సంఘం వైఖరికి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వివాదం, ఎన్నికల సంఘం నియమ నిబంధనల ఉల్లంఘనలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా సేవ్ డెమోక్రసీ పేరిట నిరసన ప్రదర్శనలు, ర్యాలీలను నిర్వహించనుంది. అక్టోబర్ 8 వరకు ఇవి కొనసాగుతాయి.

ఢిల్లీలో ఏర్పాటైన ఇండియా బ్లాక్ అగ్రనేతల కీలక భేటీ అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విలేకరులతో మాట్లాడారు. మూడు గంటల పాటు సాగిన సమావేశం వివరాలను వెల్లడించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత లోపించిందంటూ వస్తోన్న ఊహాగానాలను ఈ సందర్భంగా ఆయన కొట్టిపారేశారు.

India Bloc Launches Save Democracy Drive on Oct 2 to 8 Demands CEC Gyanesh Kumar Resignation

ఇండియా బ్లాక్ ప్రకటించిన ఈ వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నాయి. 6న ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి నిరసన ప్రదర్శన చేపట్టనున్నాయి. అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రపతిని కలవాలని ఇండియా బ్లాక్ నిర్ణయించింది.

సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ లల్లో బెర్తులు అందుబాటులో ఉన్న రైళ్లు
సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ లల్లో బెర్తులు అందుబాటులో ఉన్న రైళ్లు

ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి అపాయింట్‌మెంట్ కోరినట్లు ఖర్గే వెల్లడించారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకుని, వాటి స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోందనే విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాలని, చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరుతామని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం లోపభూయిష్టమైన విధానాలను అనుసరిస్తోందని మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్ఐఆర్ లో ఈసీ కీలక మార్పు- ఆ జంఝాటం నుంచి విముక్తి
ఎస్ఐఆర్ లో ఈసీ కీలక మార్పు- ఆ జంఝాటం నుంచి విముక్తి

ఎన్నికల ప్యానెల్‌లో ఉన్న కొందరు ఉన్నతాధికారులు స్వతంత్రంగా వ్యవహరించట్లేదని, కేంద్ర పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా తయారయ్యాయని ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కమిషన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల నిర్దేశాల ప్రకారమే నడుస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో పారదర్శకత పునరుద్ధరణ, సీఈసీ రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళనలు ఆపబోమని ఖర్గే అన్నారు.

అనంతరం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. తామంతా ఐక్యతతో ఉన్నామని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పోరాడతామని స్పష్టం చేశారు. ఇండియా బ్లాక్ లో పొరపచ్చాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతిపక్షాలు ఏకతాటిపై రాక తప్పదని ఆమె అన్నారు.

అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రజాస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ మూకుమ్మడి దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థ మొత్తాన్ని కూడా హైజాక్ చేశారని ధ్వజమెత్తారు. దీన్ని చూస్తూ మౌనంగా ఉండదలచుకోలేదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, దీన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన వారికి శిక్ష పడేలా చేస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+