టీమిండియా బౌలర్లకు సేమ్ ట్రీట్మెంట్: బ్యాటర్ మారాడంతే: విండీస్ వీరుడి సునామీ సెంచరీ

భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో తడాఖా చూపాడు. గువాహటి బార్సపారా స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నూతన రికార్డును సృష్టించాడు. మెరుపు సెంచరీ చేశాడు. 64 బంతుల్లో 100 పరుగులు బాదాడు. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. టీమిండియాపై అత్యంత వేగంగా అర్ధసెంచరీ పూర్తి చేసిన వెస్టిండీస్ బ్యాటర్‌గా నిలిచాడు.

ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ఎన్నో ఏళ్లుగా పటిష్టంగా ఉన్న క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో అహ్మదాబాద్ వేదికగా భారత్‌పై జరిగిన వన్డే మ్యాచ్‌లో గేల్ 30 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఆ తర్వాత మళ్లీ 2019లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో సైతం గేల్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇప్పుడు క్యాంప్‌బెల్ ఆ రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. అతని మెరుపు ఇన్నింగ్ లో అయిదు భారీ సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి.

West Indies Opener John Campbell Made blistering 100 from 64 Balls in 2nd ODI vs India flying start

68 బంతుల్లో 101 పరుగులు చేసిన క్యాంప్ బెల్.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్ లో నమన్ ధీర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 20 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది వెస్టిండీస్. షై హోప్- 42, అమీర్ జంగూ ఆరు పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మొదటి వన్డేలో ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ కూడా ఇదే రేంజ్ లో ఆడిన విషయం తెలిసిందే. సరిగ్గా 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడతను. రెండో వన్డేలో కూడా వెస్టిండీస్.. టీమిండియా బౌలర్లకు సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చింది. బ్యాటర్ మారాడంతే అనిపించింది. అదే మ్యాచ్ లో క్యాంప్ బెల్ హాఫ్ సెంచరీ చేశాడు.

అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత యువ పేస్ బౌలింగ్ విభాగంతో బరిలోకి దిగిన భారత్‌కు క్యాంప్‌బెల్ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన మొదటి ఓవర్‌లో నెమ్మదిగా ఆడి డిఫెన్స్‌కు పరిమితమైనప్పటికీ ఆ తర్వాత తడాఖా చూపాడు క్యాంప్ బెల్. ఫాస్ట్ అవుట్‌ఫీల్డ్‌ను ఉపయోగించుకుంటూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో గాయపడిన జస్టిన్ గ్రీవ్స్ స్థానంలో కీసీ కార్టీ విండీస్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కార్టీ తొమ్మిది పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

వన్డేల్లో అరంగేట్రం చేసిన భారత బౌలర్ ఆకిబ్ నబీ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని మైదానం నలుమూలలా భారీ షాట్లు ఆడాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఏడో ఓవర్లో ఒక సిక్సర్, మూడు ఫోర్లతో క్యాంప్‌బెల్ చెలరేగాడు. 2019లో ఐర్లాండ్‌పై 179 పరుగులు చేసిన తర్వాత క్యాంప్‌బెల్ వన్డే కెరీర్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్లు నమోదు చేయలేకపోయాడు. సుదీర్ఘ విరామం అనంతరం భారత్ పై భారీగా పరుగులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+