వెల్లడి: బుర్ద్వాన్ పేలుళ్లకు డబ్బు ఇలా చేరుకుంది!

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ పేలుళ్లలో లభించిన డబ్బుకు సంబంధించిన వివరాలను ఆర్థిక నిఘా విభాగం(ఎఫ్ఐయు) సేకరించింది. మూడు స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)లు ఇస్లామీ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్‌లో ఉంచిన డబ్బును ఉగ్రవాదులు అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల సరిహద్దు గుండా బుర్ద్వాన్‌కు చేర్చారు.

ఉగ్రవాద సంస్థ జమాతే ఇ ఇస్లామీ(జామాతే ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్) ఈ మార్గం ద్వారానే తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు నిధులను సమకూర్చుకుంటోందని, మరో ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా కూడా ఈ విధంగానే ఆర్థిక వనరులను సమకూర్చుకుంటోందని భారత, బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కనుగొన్నాయి.

ఎన్జీవోల పాత్ర

రాబత ఆల్ అలాం ఆల్ ఇస్లామీ, ఆల్ నహీయాన్, ది రీవైవల్ ఆఫ్ ఇస్లామిక్ హెరిటేజ్ అనే మూడు స్వచ్ఛంద సంస్థలు ఈ ఉగ్రవాద సంస్థలకు డబ్బును పశ్చిమ బెంగాల్‍‌కు, ఆ తర్వాత బుర్ద్వాన్‌కు తరలించినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రాథమికంగా నిర్ధారించాయి.

2009-2012 సంవత్సరాల మధ్య రూ. 850 కోట్ల మేర పశ్చిమబెంగాల్ రాష్ట్రం బయటికి తరలించారు. ఈ మొత్తంలో కొంత ఇస్లామీ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్‌లో జమ కాగా, మిగితా మొత్తం సౌదీ అరేబియా, కువైట్, మెక్సికోలకు తరలించారు. మూడు ఎన్జీవో సంస్థలు, కువైట్‌లో ఒకటి, సౌదీలో రెండు ఈ మొత్తాన్ని స్వీకరించి, హవాలా ద్వారా జెఎంబికి బదిలీ చేశాయి.

బంగ్లాదేశ్, ఇండియాలకు ఈ హవాలా మార్గాన్ని ప్రత్యేక్షంగా ఉపయోగించకుండా మరో ఛానల్‌ను ఉపయోగించారు. ఈ మొత్తం డబ్బు నిర్వహణను కౌసర్‌కు అప్పగించారు. ఇప్పుడతను పరారీలో ఉన్నాడు. కాగా, ఇంటెలిజెన్స్ విచారణలో అతని పేరు బయటపడింది. కౌసర్ డబ్బును ఇక్కడికి తీసుకువచ్చే వాళ్లలో ఒకడని తేలింది.

 Revealed: Detailed trail of money that went into Burdwan blasts!

ఉగ్రవాదానికి డబ్బు పంపిణీ

ఉగ్రవాద కార్యకలాపాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే గత నాలుగు సంవత్సరాల్లో సుమారు రూ. 15కోట్లను మనదేశంలోకి ఈ సంస్థలు తీసుకువచ్చినట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. కాగా, ఈ ప్రణాళిక 2009లోనే ప్రారంభించి 2010 నుంచి అమలు చేయడం ప్రారంభించారు. అనాటి నుంచి కువైట్, సౌదీ అరేబియాల నుంచి ఈ మూడు ఎన్జీవో సంస్థల ద్వారా మనదేశంలోకి క్రమంగా డబ్బు చేరినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కనుగొన్నాయి.

మందుగుండు, ఆయుధాల కోసం జెఎంబి ఏడాదికి కోటి రూపాయలను కేటాయిస్తున్నట్లు, అందుకు పనిచేస్తున్న వారికి రూ. 40లక్షల జీతాలను ఇస్తున్నట్లు, మరో రూ. 3కోట్లను లంచాలు, అద్దెల కోసం వెచ్చిస్తున్నట్లు తేలింది. ఈ సమాచారం బంగ్లాదేశ్ ద్వారా ఇండియా ఏజెన్సీలకు తెలిసింది.

రాజకీయ కోణం

బుర్ద్వాన్ ఎపిసోడ్ మొత్తం రాజకీయ అజెండాగా ఉంది. భారతదేశాన్ని ప్రయోగశాలగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. బుర్ద్వాన్ ఘటనపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఈ), ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబి)లను పశ్చిమ బెంగాల్‌కు పంపింది. ఉగ్రవాద పరిధిదాటి ఈ ఘటన జరిగినట్లు విచారణలో తెలిసింది. ఇది ఒక పక్కా ప్రణాళికతో జరిగినట్లు తెలుస్తోంది.

భారతదేశంలో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను విస్తృతపర్చి ఓ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రణాళిక వేసినట్లు తేలింది. దీనిపై విచారణ కోసం మంగళవారం బంగ్లాదేశ్ ఉన్నతాధికారులు కూడా మనదేశానికి రానున్నారు. భారత్-బంగ్లాదేశ్ విచారణ విభాగాల అధికారులు సంయుక్తంగా ఈ ఉగ్రవాద కార్యకలాపాలను లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అవామీ లీగ్‌తో పోరాడుతున్న జమాతే ఇ ఇస్లామీ తన ఉగ్రవాద విభాగం జెఎంబిని ఉపయోగించి ముందుకు వెళుతోంది. రాజకీయంగా గెలువలేమని తెలుసుకున్న జమాతే ఇ ఇస్లామీ.. ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+