Revenge: మనిషి మీద కోపం, ఫామ్ హౌస్ లోకి వెళ్లిన ఆవులను ఏం చేశాడంటే ?, వీడు మనిషా ?

బెంగళూరు/కొడుగు: కక్షలు ఏ రూపంలో ఎలా వస్తాయో చెప్పడం చాలా కష్టం. రాజకీయ కక్షల కారణంగా, పాత గొడవల కారణంగా హత్యలు జరుగుతున్నాయి, ఆస్తి పంపకాల విషయంలో హత్యలు జరిగుతున్నాయి, మద్యం మత్తులో గొడవలు పడి చాలా మంది హత్యకు గురైన విషయం మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము.

చిన్నచిన్న వియాలకు హత్యలు జరిగిపోవడంతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. పశువులు తోటలో మేత మేయడానికి వెళ్లిన సమయంలో రగిలిపోయిన వ్యక్తి ఆ పశుల యజమాని మీద కసితో పశువుల మీద రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. పచ్చగడ్డి మేస్తున్న పశువులు మా మీద కిరాతకులు రివాల్వర్ తో కాల్చుతున్నారని పసగట్టలేకపోయాయి.

Revenge: Cow shot dead near Kodagu in Karnataka.

కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని వీరాజపేట్ తాలుకాలోని గుహ్యా గ్రామంలో నరేంద్ర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నరేంద్రకు కాఫీ తోటలతో పాటు ఫామ్ హౌస్ లు ఉన్నాయి. బాగా డబ్బులు సంపాధిస్తున్న నరేంద్రకు చాలా బలుపు ఎక్కువ అని సమాచారం. నరేంద్ర నివాసం ఉంటున్న గ్రామంలోనే మణి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

మణి నాలుగు ఆవులు పెంచుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. మణికి చెందిన నాలుగు ఆవులు నరేంద్రకు చెందిన తోటలోకి వెళ్లాయి. ఆ సందర్బంలో నరేంద్ర రగిలిపోయాడు, పగవాడి ఆవులు తన తోటలోకి వచ్చాయని అనుకున్న నరేంద్ర తుపాకి తీసుకుని ఆవుల మీద కాల్పులు జరిపాడు. తుపాకి కాల్పులకు రెండు ఆవుల ప్రాణం పోయింది.

మిగిలిన రెండు ఆవులు ఇంటికి రావడం, మిగిలిన రెండు ఆవుల కనపడకపోవడంతో నరేంద్ర వెతకడం ప్రారంభించాడు. నరేంద్ర తోటలో రెండు ఆవులు శవమై కనిపించడంతో నరేంద్ర హడలిపోయాడు. నరేంద్ర మీద మణి కేసు పెట్టడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. గ్రామంలోని పాతకక్షల కారణంగా ఆవులను కాల్చి చంపండం కొడుగు జిల్లాలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+