Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Revenge: పుట్టింటిలో మకాం వేసిన భార్య, నోరుకొట్టుకున్న భర్త, ఐదు మందిని సజీవదహనం చేసిన భర్త !

జలంధర్/పంజాబ్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం క్రితం దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను గొడవలు ఎక్కువ కావడంతో భార్య పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటికి పిలుచుకుని రావాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. పెద్దలు పంచాయితీలు చేసినా భార్య మాత్రం పుట్టింటి నుంచి భర్త ఇంటికి వెళ్లనని తేల్చి చెప్పింది. భార్య తీరుతో భర్త రగిలిపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలు, అత్తమామలను సజీవదహనం చేసిన భర్త అతని పగ తీర్చుకున్నాడు.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

పంజాబ్ లోని జలంధర్ లో పరమజిత్ కౌర్ అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం లూథియానాలోని ఖర్చద్ పూర్ లో నివాసం ఉంటున్న కులదీప్ సింగ్ తో పరమజిత్ కౌర్ వివాహం జరిగింది. పరమజిత్ కౌర్ ను వివాహం చేసుకున్న కుల్ దీప్ సింగ్ అతని భార్యతో కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశాడు.

 పిల్లలు పుట్టిన పంచాయితీలు

పిల్లలు పుట్టిన పంచాయితీలు

కుల్ దీప్ సింగ్, పరమజిత్ కౌర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం క్రితం కుల్ దీప్ సింగ్, పరమజిత్ కౌర్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను గొడవలు ఎక్కువ కావడంతో పరమజిత్ కౌర్ ఆమె ఇద్దరు పిల్లలను పిలుచుకుని జలంధర్ లలోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

 భార్య తీరుతో రగిలిపోయాడు

భార్య తీరుతో రగిలిపోయాడు

పుట్టింటిలో మకాం వేసిన భార్య పరమజిత్ కౌర్ ను తన ఇంటికి పిలుచుకుని రావాలని కులదీప్ కౌర్ అనేక ప్రయత్నాలు చేశాడు. కుటుంబ సభ్యులుల, బంధువులు, ఇరువైపుల పెద్దలు పంచాయితీలు చేశారు. అయితే పరమజిత్ కౌర్ మాత్రం తాను పుట్టింటిలోనే ఉంటానని, నా భర్త కుల్ దీప్ సింగ్ ఇంటికి చచ్చినా వెళ్లనని తేల్చి చెప్పింది.

 భార్య కోసం ఐదు మందిని సజీవదహనం చేసిన శాడిస్టు

భార్య కోసం ఐదు మందిని సజీవదహనం చేసిన శాడిస్టు

భార్య పరమజిత్ కౌర్ తీరుతో ఆమె భర్త కుల్ దీప్ సింగ్ రగిలిపోయాడు. భార్య పరమజిత్ కౌర్ ఇంటికి దగ్గరకు వెళ్లి గొడవ చేశాడు. పెద్దలు బుద్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. రాత్రి పరమజిత్ కౌర్, ఆమె ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి భోజనంచేసి ఇంట్లో ఉన్నారు. తరువాత భార్య పరమజిత్ కౌర్ ఇంటిలో పెట్రోల్ పోసిన కుల్ దీప్ సింగ్ నిప్పంటించాడు.

 శాడిస్టు ఎస్కేప్

శాడిస్టు ఎస్కేప్

భార్య పరమజిత్ కౌర్, ఇద్దరు కన్నబిడ్డలు, భార్య తల్లిదండ్రులను ( అత్తమామలను) సజీవదహనం చేసిన కుల్ దీప్ సింగ్ అతని పగ తీర్చుకుని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడం కలకలం రేపింది. భార్య, పిల్లలు, అత్తామామలను దారుణంగా సజీవదహనం చేసిన కుల్ దీప్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+