Revenge: ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్, అర్దరాత్రి బూతులు తిట్టిన రౌడీషీటర్ ముల్లా, వెంటాడి నరికేశారు !

బెంగళూరు/ హుబ్బళి: ఓ వర్గంలో రౌడీగా గుర్తింపు తెచ్చుకున్న యువకుడు ఆ ప్రాంతంలో అందరిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశాడు. ఓ వర్గం పూర్తిగా మద్దతు ఇవ్వడంతో మరో వర్గంలోని అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ కాలం గడిపాడు. రానురాను సెటిల్ మెంట్ లు, రాజీలు, దందాలు చేస్తున్న యువకుడు రౌడీయిజం చేశాడు. రౌడీషీటర్ గా గుర్తింపు తెచ్చుకున్న అతను తానే కింగ్ అని రెచ్చిపోయాడు. చాలాకాలం నుంచి ఆ రౌడీషీటర్ ఆగడాలను స్థానికులు ఓర్చుకున్నారు. గురువారం రాత్రి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రెచ్చిపోయిన రౌడీషీటర్ కేంద్ర ప్రభుత్వం మీద, ఉత్తరప్రదేశ్, గోవా ప్రభుత్వాలను బూతులు తిట్టాడు. స్నేహితులు నచ్చ చెప్పి ఆ రౌడీషీటర్ ను ఓ ప్రాంతానికి పిలుచుకుని వెళ్లారు. రాత్రి పొద్దుపోయే వరకు మద్యం సేవించిన రౌడీషీటర్ ఇంటికి బయలుదేరాడు. మార్గం మద్యలో రౌడీషీటర్ ను పక్కా ప్లాన్ తో వెంటాడి వెంటాడి నరికి చంపేయడం కలకలం రేపింది.

 సిటీలో రౌడీషీటర్

సిటీలో రౌడీషీటర్

కర్ణాటకలోని హుబ్బళిలో అక్బర్ ముల్లా అలియాస్ ముల్లా అలియాస్ అక్బర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ముస్లీం వర్గంలో రౌడీగా గుర్తింపు తెచ్చుకున్న అక్బర్ ముల్లా ఆ ప్రాంతంలో అందరిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశాడు. ఓ వర్గం పూర్తిగా మద్దతు ఇవ్వడంతో రెచ్చిపోతున్న అక్బర్ ముల్లా మరో వర్గంలోని అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ కాలం గడిపాడు.

 రౌడీషీటర్ అయిపోయాడు

రౌడీషీటర్ అయిపోయాడు

అక్బర్ ముల్లా రానురాను సెటిల్ మెంట్ లు, రాజీలు, దందాలు మొదలుపెట్టి రౌడీయిజం చేశాడు. అక్బర్ ముల్లా ఆగడాలు ఎక్కువ కావడంతో హుబ్బళి పోలీసులు రౌడీషీటర్ల జాబితాలో అతని పేరు చేర్చారు. రౌడీషీటర్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్బర్ ముల్లా నేనే కింగ్ అని రెచ్చిపోయాడు. చాలాకాలం నుంచి రౌడీషీటర్ అక్బర్ ముల్లా ఆగడాలను స్థానికులు ఓర్చుకుంటూ వస్తున్నారు.

 ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్

గురువారం రాత్రి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో అక్బర్ ముల్లా అసహనం వ్యక్తం చేశాడని తెలిసింది. ఆ సమయంలో రౌడీషీటర్ అక్బర్ ముల్లా నడిరోడ్డు మీద రెచ్చిపోయి కేంద్ర ప్రభుత్వం మీద, ఉత్తరప్రదేశ్, గోవా ప్రభుత్వాలను బూతులు తిట్టాడు. స్నేహితులు నచ్చ చెప్పి రౌడీషీటర్ అక్బర్ ముల్లాను ఓ ప్రాంతానికి పిలుచుకుని వెళ్లారు.

Recommended Video

    Congress Party ఓటముల పరంపరని Revanth Reddy అడ్డుకుంటారా ? | Oneindia Telugu
     వెంటాడి నరికేశారు

    వెంటాడి నరికేశారు

    గురువారం రాత్రి 11. 30 గంటల వరకు అక్బర్ ముల్లా, అతని స్నేహితులు శిరిడి నగర్ నివాసి రమేష్, ఇందిరానగర్ నివాసి నవీన్ తదితరులు మద్యం సేవించారు. మద్యం మత్తులో రౌడీషీటర్ అక్బర్ ముల్లా ఇంటికి బయలుదేరాడు. మార్గం మద్యలో రౌడీషీటర్ అక్బర్ ముల్లాను అతని ప్రత్యర్థులు పక్కా ప్లాన్ తో వేటకోడవళ్లు, కత్తులతో దాడి చేసి వెంటాడి వెంటాడి నరికి చంపేయడం కలకలం రేపింది. అక్బర్ ముల్లా హత్య కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, పాతకక్షల కారణంగా హత్య జరిగి ఉంటుందని హుబ్బళి పోలీసు అధికారులు అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+