రివర్స్ గేర్: పనికిరాదని నేనే కోసేసుకున్నా: మాట మార్చిన కేరళ స్వామి
కేరళ ఘటనలో గణేశానంద తీర్థపద స్వామి మాట మార్చాడు. తన జననాంగాన్ని న్యాయ విద్యార్థిని కోయలేదని, అది తనకు ఎటూ పనికిరాదన్న ఉద్దేశంతో తానే కోసేసుకున్నట్లు వాంగ్మూలం ఇవ్వడం అందరినీ విస్తుపోయేలా చేసింది.
తిరువనంతపురం : కేరళ ఘటనలో గణేశానంద తీర్థపద స్వామి మాట మార్చాడు. తన జననాంగాన్ని న్యాయ విద్యార్థిని కోయలేదని, అది తనకు ఎటూ పనికిరాదన్న ఉద్దేశంతో తానే కోసేసుకున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
లైంగిక దాడికి గురైన యువతి ఆ కోపంతో గణేశానంద తీర్థపద స్వామి జననాంగాన్ని కోసివేయడం, ఆస్పత్రిలో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేయడం తెలిసిందే. ఈ స్వామి గత ఏడేళ్లుగా ఆ యువతిపై పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, అందుకే విసుగు చెందిన ఆమె ఈ దాడి చేసిందని పోలీసులు చెబుతుండగా, స్వామి రివర్స్ లో వాంగ్మూలం ఇవ్వడం సంచలనం కలిగిస్తోంది.

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గణేశానంద తీర్థపద స్వామి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తానెవరిపైనా లైంగిక దాడి జరపలేదని, పనికిరాదన్న భావనతో తనే తన జననాంగాన్ని కోసివేసుకున్నట్లు వెల్లడించాడు.
అసలెవరీ స్వామి.. ఎక్కడివాడు?
15 ఏళ్ల క్రితం ఆధ్యాత్మిక గురువుగా మారడానికి ముందు గణేశానంద కేరళలోని ఎర్నాకులం జిల్లా కొల్లెంచెరి ప్రాంతంలో ఒక టీ స్టాల్ నడుపుకొనేవాడు. ఇప్పుడు ఆ దుకాణాన్ని ఆయన సోదరుడు నడుపుతున్నాడు. ఆరేళ్ల క్రితం ఆయన చివరిసారిగా తన స్వగ్రామానికి వెళ్లాడు.
హిందూ ఐక్యవేదిక అనే సంస్థతో గణేశానందకు సంబంధాలుండేవి. కేరళలో సంఘ సంస్కర్త అయిన చట్టాంబి స్వామి జన్మస్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేయడంతో పాటు వరుసపెట్టి ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా గణేశానంద ప్రాచుర్యంలోకి వచ్చాడు.
ఆ తర్వాత కేరళ అదనపు డీజీపీ డాక్టర్ బి. సంధ్యపై హిందూ సంస్థలు చేసిన ఉద్యమానికి కూడా గణేశానంద నాయకత్వం వహించాడు. ఆ ఉద్యమ సమయంలోనే ప్రస్తుతం ఆయన జననాంగం కోసేసినట్లు చెబుతున్న యువతి కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడింది.
సదరు యువతి తల్లి ఆయనను పూజల కోసం ఇంటికి పిలిచేవారని పోలీసులు చెప్పారు. అనారోగ్యంతో ఉన్న ఆమె భర్తకు జబ్బు నయం చేస్తానని చెప్పి ఆశ్రమానికి తీసుకెళ్లి, ఆమె కుమార్తెపై అతడు లైంగికంగా దాడి చేసే వాడని పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications