Viral Video: కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడ్డ తల్లీకొడుకులు.. మెరుపు వేగంతో దూసుకెళ్లి కాపాడిన అధికారిణి..

చాలా మంది రైల్వే స్టేషన్లలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఇష్టారీతిన ట్రాక్ లు దాటుతారు. ముఖ్యంగా కదులుతున్న ట్రైన్ ఎక్కుతుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇలానే కదులుతున్న ట్రైన్ ఎక్కుబోయిన తల్లీకొడుకులు పట్టు తప్పి పట్టాలపై పడబోయారు. అంతలోనే వారిని కాపాడారు.

ట్వీట్..

ట్వీట్..


పశ్చిమ బెంగాల్‌లోని బంకురా రైల్వే స్టేషన్‌లో ఒక వృద్ధ మహిళ, ఆమె కొడుకు ప్రాణాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. తన ట్వీట్‌లో RPF సిబ్బందిని ప్రశంసించింది.

పరుగెత్తి..

పరుగెత్తి..

ఈ వీడియోలో రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరడం కనిపిస్తుంది. కదులుతున్న ట్రైన్ ను ఎక్కడానికి ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. ఓ వృద్ధ మహిళ, ఆమె కొడుకును కూడా కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన మహిళా RPF అధికారి వెంటనే ఇద్దరిని చేరుకోవడానికి పరుగెత్తడం ప్రారంభించింది.

జారిపడి..


కొన్ని సెకన్ల తర్వాత, మహిళ, ఆమె కుమారుడు ప్లాట్‌ఫారమ్‌పై జారిపడి కింద పడిపోవడం కనిపించింది. కానీ ఏదైనా ప్రమాదం జరగకముందే, RPF అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించారు. మరికొందరు కూడా వారి వైపు దూసుకురావడం కనిపిస్తుంది. ఈ ఘటన స్టేషన్‌లో అమర్చిన సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

అలా రైలు ఎక్కొద్దు..

అలా రైలు ఎక్కొద్దు..

"సేవ & సేవా భావ్! వెస్ట్ బెంగాల్‌లోని బంకురా స్టేషన్‌లో RPF సిబ్బంది తీసుకున్న అప్రమత్తత & వేగవంతమైన చర్య కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు జారిపడిన ఒక వృద్ధ మహిళ & ఆమె కుమారుడి ప్రాణాలను కాపాడింది. ప్రయాణీకులు కదులుతున్న రైలులో ఎక్కవద్దని లేదా దిగవద్దని అభ్యర్థించబడింది. ," అని రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది.

 28,000 పైగా వ్యూస్..

28,000 పైగా వ్యూస్..

ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసినప్పటి నుండి 28,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దీనికి వందల కొద్దీ లైక్‌లు, రీట్వీట్లు కూడా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆటోమేటిక్ డోర్‌లను అమర్చాలని భారతీయ రైల్వేలకు వినియోగదారులు సూచనలు చేయగా, మరికొందరు ఆర్‌పిఎఫ్ అధికారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+