Junior Doctor Rape Murer case:మమతకు షాక్.. సీబీఐకి కేసు బదిలీ..!!
బెంగాల్‌లో కొద్ది రోజుల క్రితం ఓ జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం ఆపై హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా జూడాలు మెడికల్ సిబ్బంది నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు తమ విధులకు స్వస్తి పలికారు. వెంటనే ఘటనపై విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఒక వారంలోగ పోలీసులు కేసును పరిష్కరించకపోతే సీబీఐకి అప్పగిస్తామని చెప్పారు. అయితే పరిస్థితి చేదాటి పోతుండటంతో కేసు హైకోర్టుకు చేరింది.
ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో జరిగిన ఈ ఘటనపై బెంగాల్ హైకోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. అంతేకాదు ఇప్పటి వరకు కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సీబీఐకి విధిగా అందజేయాలని కోల్‌కతా పోలీసులను ఆదేశించింది. కోర్టు సమక్షంలో కేసుు విచారణ చేయాలని మృతురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.వీరి పిటిషన్‌తో పాటు చాలామంది ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్‌లను విచారణకు స్వీరించిన ధర్మాసనం విచారణ పద్ధతిలో చాలా లోపాలున్నట్లుగా గుర్తించింది. ఘటన జరిగి ఐదు రోజులు కావొస్తున్నప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ ఇదే పద్దతిలో జరిగితే కీలకమైన సాక్ష్యాలు లేదా రుజువులు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఇదెలా ఉంటే కోల్‌కతా జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య దేశాన్ని కుదిపేసింది. దేశ వ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్యూటీలో ఉన్న డాక్టరు అత్యాచారంకు గురికావడం అత్యంత దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. సీబీఐతో విచారణ చేయించాలని రెసిడెంట్ డాక్టర్ల సంఘం జాయింట్ సెక్రటరీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి డిమాండ్ చేశారు. సత్వరమే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే సీబీఐ విచారణ చేయడమే సబబని భావించిన హైకోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications