వీడియో సెలబ్రిటీ: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: సోషల్ మీడియాను చక్కగా వినియోగించుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఒక్కరోజులో ప్రపంచానికి పరిచయం అవుతారు. అలానే చేశాడో వ్యక్తి. అది ముంబైలోని ఓ రద్దీ రోడ్డు. వాహనాలు అటు ఇటూ వెళుతున్నాయి. ఇంతలో మధ్య వయసు ఉన్న ఓ వ్యక్తి రోడ్డు మీదకు వచ్చాడు.

అటు ఇటూ పోతున్న వాహనాలతో తమకేమీ సంబంధం లేనట్టుగా ఒక్కచూపు చూశాడు. అంతేనా... నలుగురూ చూస్తున్నారని ఏ మాత్రం లెక్కచేయకుండా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. తొలుత చూసిన వారు ఏదో ఆషామాషీగా డ్యాన్స్ చేస్తున్నాడులే అని అనుకున్నారు.

ఆ తర్వాత అతడు తనతో తాను నవ్వుకుంటూ, ఏదో పాటను పాడుకుంటూ అద్భుతమైన డాన్స్‌లు చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా అతగాడు చేసిన డ్యాన్స్‌ను చూసి చుట్టూ మూగినవారు ఇదేదో బాగుందే అనుకుంటూ అతడు డ్యాన్స్ చేస్తున్నంత సేపూ అలాగే చూస్తుండిపోయారు.

తన డ్యాన్స్‌ను చూస్తున్నారని గ్రహించిన అతడు మధ్యమధ్యలో కొన్ని పిచ్చిపిచ్చి చేష్టలు, అల్లరి పనులు చూస్తూ చూపరులను ఆకట్టుకున్నాడు. ఈ డ్యాన్స్ తతంగం మొత్తాన్ని ఎవరో వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This man seems to have gone crazy! In the middle of a busy Mumbai street, he's seen dancing even as the traffic zoomed past him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి