షాక్:కేరళలో పెరిగిన అత్యాచారాలు, గత ఏడాదితో పోలిస్తే పెరిగిన అత్యాచారాలు
కేరళ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులపై కూడ ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తిరువనంతపురం:కేరళ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులపై కూడ ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇటీవల కాలంలో మళయాల సినీ నటిపై లైంగిక దాడి జరిగన ఘటన సంచలనం సృష్టించింది.ఈ ఘటనతో మహిళలపై అత్యాచారాలు గత ఏడాది కంటే ఈ ఏడాది పెరగడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.

మళయాళ సినీ నటిపై లైంగిక వేధింపులు చోటుచేసుకోవడంతో నేరాల జాబితాను తీశారు. 2016 లో మహిళలపై 1644 ఘటనలు జరిగితే చిన్నారులపై 924 ఘటనలు జరిగాయి.
2015 లో మహిళలపై 1263, పిల్లలపై 720 చోటు చేసుకొన్నాయి.సాధారణంగా ఏ ఏడాదికి ఏడాది ఇలాంటివి తగ్గుముఖం పట్టాల్సి ఉండగా మరింత పెరుగుతుండడంపై అధికారులు విస్తుపోతున్నారు.












Click it and Unblock the Notifications