మహిళకు వందనం: చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్‌గా కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్త

నాలుగేళ్ల వయస్సులో తను నడుస్తున్నప్పుడు చంద్రుడు తన వెంటే ఎందుకు వస్తున్నాడు అనే ఆలోచన ఆమెలో మొదలైంది. అసలు చంద్రడు అంత ఎత్తున ఎలా ఉన్నాడు అనే ఆలోచన మొదలైంది. కానీ నేడు అదే చందమామ పైకి ఓ మిషన్‌ను పంపే జట్టులో తాను భాగస్వామి అవుతానని ఊహించి ఉండదు. అవును చంద్రయాన్-2 ప్రాజెక్టులో ప్రధాన భూమిక పోషించింది ఒక మహిళ. ఆమెపేరే రీతూ కరిధాల్.

చంద్రుడిపై నీటి ఆనవాలు, ఇతర అంశాలను వెలికి తీసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్-2ను ప్రయోగిస్తోంది. ఈ మిషన్‌ను పంపడంలో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది. చంద్రయాన్ -2 టీమ్‌ను రీతూ కరిధాల్ లీడ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి పరిశోధనల్లో ప్రపంచ వ్యాప్తంగా 28.8శాతం మంది మహిళలు పాల్గొంటున్నట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. సాధారణంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మ్యాథమ్యాటిక్స్ రంగంలో మహిళలు తక్కువమంది కనిపిస్తారు. ఒక వేళ ఈ రంగంలోకి అడుగుపెడితే ఈ రంగంకే తమ జీవితాన్ని అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 69 సైన్స్ అకాడెమీల్లో 12 శాతం మంది మహిళా శాస్త్రవేత్తలు మాత్రమే పనిచేస్తున్నారు.

ritu

నోబెల్ ప్రైజ్ 1901లో ఏర్పాటు అయ్యాక ఇప్పటి వరకు సైన్స్ కేటగిరీలో 17 మంది మహిళలు మాత్రమే ఈ ప్రైజ్‌ను గెలుచుకోగలిగారు. సైన్స్ రంగంలో, పరిశోధన కేంద్రాల్లో , అత్యున్నత స్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో మహిళలు ఉన్నారు కానీ... 1969 ఆగష్టు 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఇస్రో‌లో మాత్రం ఈ టాప్ పొజిషన్‌లో ఒక మహిళ అది కూడా రీతూ ఉండటం విశేషం. పురుషాధిక్యత ఉన్న ఈ రంగంలో మహిళలు కూడా రాణించడం నిజంగా హర్షణీయం. చంద్రయాన్ -2 ప్రాజెక్టులో మిషన్ డైరెక్టర్‌గా రీతూ కరిధాల్ నియామకం ఒక సంచలనం. సైన్స్ అనేది అమ్మాయిలకు కాదు అని చెప్పే ప్రతి ఒక్కరికి రీతూ సాధించిన విజయమే నిదర్శనం. ఓ వైపు చంద్రయాన్ ప్రాజెక్టుకు సమయం కేటాయిస్తూ మరో వైపు కుటుంబంను చూసుకుంటూ సమతుల్యత పాటించడంలో రీతూ సక్సెస్ అయ్యారు. అంతకుముందు మార్స్ మిషన్‌లో కూడా పనిచేసి విజయం సాధించారు రీతూ.

మొత్తానికి చంద్రయాన్ -2 విజయం తర్వాత ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు రీతూ కరిధాల్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చదువుతున్న అమ్మాయిలకు రీతూ కచ్చితంగా ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. విజయాలకు ఆకాశమే హద్దు అని పెట్టుకోకుండా నిరంతరం కృషి చేసి భారత్‌ను ప్రపంచదేశాల సరసన సగర్వంగా నిలిచేలా కీలక పాత్ర పోషించారు రీతూ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+