మంత్రి రెడ్డి ఇంటి పక్కలో వెంటాడి వెంటాడి ఫేమస్ హోటల్ లో నరికేశారు, స్పాట్ ఫినిష్ !
ఐటీ హబ్ బెంగళూరులో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి నివాసం సమీపంలో ఓ రౌడీషీటర్‌ను దుండగులు అత్యంత దారుణంగా వెంటాడి వెంటాడి నరికి చంపి పరారయ్యారు. జై ప్రకాష్ అలియాస్ అప్పి అనే రౌడీషీటర్ ను అందరూ చూస్తున్న సమయంలో స్పాట్ లో చంపేశారు. హత్యకు గురైంది రౌడీ షీటర్ అని, ఐదారు మంది ప్రత్యర్థులు రౌడీ షీటర్‌ను దారుణంగా నరికి చంపేసి దర్జాగా వెళ్లిపోయారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.
ఈ ఘటన బెంగళూరులోని అడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్కసంద్రలో బుధవారం సాయంత్రం జరిగింది. అడుగోడి పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో హత్యకు గురైన రౌడీషీటర్ జైప్రకాష్ హోటల్‌లోకి టీ తాగేందుకు వచ్చాడు, ఈ సమయంలో హఠాత్తుగా మూడు వైపుల నుంచి వచ్చిన ప్రత్యర్థులు మారణాయుధాలతో జైప్రకాష్ ను చంపేసి పారిపోయారు.

సౌత్ ఈస్ట్ డివిజన్ డీసీపీ సీకే బాబాతోపాటు సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు జైప్రకాష్ అనుచరులను చెదరగొట్టి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
లక్కసంద్ర బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ దేవాలయం సమీపంలో ఉన్న జైప్రకాష్ హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం చెయ్యడానికి వచ్చారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని జైప్రకాష్ ముందుగానే వెళ్లాడు.
ఈ సమయంలో జై ప్రకాష్‌ను గమనించిన దుండగులు ఆరు గంటల ప్రాంతంలో ఆయుధాలతో అతని మీద దాడి చేశారు. దుండగులు దాడి చేయడంతో జై ప్రకాష్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. సమీపంలోని విజయ సాగర్ హోటల్‌లోకి ప్రవేశించిన జై ప్రకాష్ హోటల్ దాక్కోవడానికి ప్రయత్నించాడు అయితే హోటల్ లోనే తప్పించుకోకుండా అతన్ని నరికి చంపేశారు.

హత్యకు గురైన రౌడీషీటర్ జైప్రకాష్ 2006లో జరిగిన రమేష్ హత్య కేసులో జైలుకు వెళ్లి తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడని పోలీసు అధికారులు అంటున్నారు. పాత కక్షల కారణంగానే రౌడీషీటర్ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మాట్లాడిన డీసీపీ సీకే బాబా రౌడీషీటర్ జైప్రకాష్ అలియాస్ అప్పి ని ప్రత్యర్థులు హత్య చేశారని అన్నారు.
హనుమాన్ జయంతి నేపథ్యంలో అన్నదానం చెయ్యడానికి జైప్రకాష్ అనుచరులు అన్ని సిద్దం చేస్తున్నారని, ఆ సమయంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో జైప్రకాష్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడని, తరువాత నిందితులు వెంటాడివెంటాడి హత్య చేశారని, ఎందుకు హత్య జరిగింది అని ఆరా తీస్తున్నామని, ఐదు బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నామని, అందరిని త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ బావా మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications