అధికార పార్టీ నాయకుడు, హాయ్ చెప్పి కాల్చి పారేసిన ప్రత్యర్థులు, లండన్ లో కూతురు !
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఈడీ అధికారుల బృందంపై వందలాది మంది స్థానికులు దాడి చేశారు. టీఎంసీ నాయకుడిపై ఈడీ అధికారుల దాడి చేయడంతో రెచ్చిపోయిన టీఎంసీ కార్యకర్తలు ఈడీ అధికారులపై దాడి చెయ్యడం పశ్చిమ బెంగాల్ లో కలకలం రేపింది.ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడిని పట్టపగలు దారుణంగా హత్య చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టీఎంసీ పవర్ ఫుల్ మాస్ నాయకుడు సత్యన్ చౌదరిపై ఆదివారం పట్టపగలు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్‌లో చోటుచేసుకుంది. ముర్షిదాబాద్ టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యన్ చౌదరిని వెంటనే ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సత్యన్ చౌదరి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసు అధికారులు తెలిపారు.

బైక్‌లపై వచ్చిన కొందరు దుండగులు సత్యన్ చౌదరిపై అతి సమీపం నుంచి తుపాకులతో కాల్పులు జరిపారు. అనంతరం సత్యన్ చౌదరి కుప్పకూలిపోయాడని స్థానిక టీఎంసీ నేత ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు. మరోవైపు టీఎంసీ నేత సత్యన్ చౌదరి హత్య కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సత్యన్ చౌదరి గతంలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరికి సన్నిహితంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత సత్యన్ చౌదరి టీఎంసీ మాస్ లీడర్ ముకుల్ రాయ్‌తో కలిసి పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీలో చేరారు.
ముర్షిదాబాద్ ప్రాంతంలో ప్రముఖ నాయకుడిగా సత్యన్ చౌదరి గుర్తింపు పొందారు. మృతి చెందిన టీఎంసీ నేత సత్యన్ చౌదరి కుమార్తె లండన్‌లో చదువుతున్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం భరత్‌పూర్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సత్యన్ చౌదరి అతని సన్నిహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్న సమయంలో బైక్ లో వచ్చిన కొందరు దుండగులు తుపాకులు, రివాల్వర్లతో కాల్పులు జరిపారు.

సత్యన్ చౌదరి హత్యకు గురైనారని వెలుగులోకి రాగానే ఆ ప్రాంతంలో దుమారం రేగింది. సీపీఎం పార్టీ నాయకులు సత్యన్ చౌదరిని హత్య చేశారని బెర్హంపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముఖోపాధ్యాయ ఆరోపించారు.అయితే సీపీఐ (ఎం) ముర్షీదాబాద్ జిల్లా కార్యదర్శి జమీర్ మొల్లా మాట్లాడుతూ టీఎంసీలో అంతర్గత పోరు వలనే సత్యన్ చౌదరి హత్యకు గురైనాడని ఆరోపించారు.
ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణంగా సత్యన్ చౌదరి హత్యకు గురయ్యాడని సీపీఎం నాయకులు ఆరోపించారు. సత్యన్ చౌదరి హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం పార్టీ నాయకులు చెప్పారు.సత్యన్ చౌదరి హత్య కేసు విచారణ ప్రారంభించామని, సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సూర్యప్రతాప్ యాదవ్ మీడియాకు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications