ఓట్లు ఆర్జేడీకి, సీట్లు బీజేపీక..నితీశ్ కు - బీహార్ లో అంతు చిక్కని లెక్కలు..!!
బీహార్ గెలుపు లెక్కలు ఆసక్తి కరంగా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. ఏకంగా డబుల్ సెంచరీ దాటింది. అయితే, తుది ఫలితాల తరువాత మాత్రం ఓట్ల లెక్కలు కొత్త చర్చకు కారణం అవుతున్నాయి. సీట్ల రేసులో ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ ఓట్ల రేసులో ఆర్‌జేడీ పెద్ద పార్టీగా నిలిచింది. ఓట్ల శాతం చెక్కుచెదరనప్పటికీ, సీట్ల సంఖ్య భారీగా తగ్గింది. అయితే, ఈ ఓట్లు.. సీట్ల లెక్కలు మాత్రం రాజకీయంగా కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
బీహార్ ఎన్నికల ఫలితాల లెక్కలు వెల్లడయ్యాయి. అతి పెద్ద పార్టీగా నిలిచి అత్యధికంగా 89 సీట్లను సాధించిన బీజేపీకి 20.8 శాతం ఓట్లే పడగా, 25 సీట్లకు పరిమితమైన ఆర్‌జేడీకి ఏకంగా 23 శాతం ఓట్లు పడ్డాయి. 2020 ఎన్నికల్లోనూ దాదాపు ఇంతే శాతం ఓట్లను లాలూ పార్టీ దక్కించు కుంది. ఆర్జేడీ ఈ సారి 143 సీట్లలో పోటీ చేయగా, 25 సీట్లనే గెలుచుకోగలిగింది. రాష్ట్రంలో 23 శాతం ఓట్లను ఆర్‌జేడీ పొందింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ 144 స్థానాల్లో పోటీచేసి, 75 సీట్లను కైవసం చేసుకుంది. ఆనాడు ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్‌జేడీకి 23.11 శాతం ఓట్లు పడ్డాయి. ఓట్ల వాటా పెద్దగా చెక్కు చెదరనప్పటికీ, సీట్ల సంఖ్య 75 నుంచి 25కు తగ్గిపోవడం అనే అంశం ఆర్‌జేడీని తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఈ ఎన్నికల్లో ఆర్‌జేడీకి 1.15 కోట్ల ఓట్లు పడ్డాయి. బీజేపీకి దాదాపు 1 కోటి ఓట్లు పడ్డాయి. బీజేపీ కంటే ఆర్‌జేడీకి 15 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. బీజేపీకి అత్యధికంగా 89 అసెంబ్లీ సీట్లు వచ్చినా, ఆర్‌జేడీ కంటే తక్కువ ఓట్లు ఎందుకు పడ్డాయి ? అంటే, బీజేపీ 101 స్థానాల్లోనే పోటీచేయగా, ఆర్‌జేడీ 143 సీట్లలో పోటీ చేసింది. బీజేపీ కంటే 42 ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడంతో ఆర్‌జేడీ సాధించిన ఓట్ల సంఖ్య పెరిగింది. ఆర్‌జేడీ : 23 శాతం ఓట్లు - 25 సీట్లు రాగా, బీజేపీ : 20.8 శాతం ఓట్లు - 89 సీట్లు దక్కించుకుంది. జేడీయూ : 19.25 శాతం ఓట్లు - 85 సీట్లు, కాంగ్రెస్ : 8.71 శాతం ఓట్లు - 6 సీట్లు, ఎల్‌జేపీ : 4.97 శాతం ఓట్లు - 19 సీట్లు వచ్చాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేసి దాదాపు 43 లక్షల ఓట్లను పొందింది. హస్తం పార్టీ గత ఎన్నికల్లో 19 సీట్లను సాధించగా, ఈసారి 6 సీట్లకు పరిమితమైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 200 మార్కును దాటడం ఇది రెండోసారి. 2010 ఎన్నికల్లో ఏకంగా 206 సీట్లను సాధించిన రికార్డు దానికి ఉంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఐదు స్థానాలను, బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానాన్ని గెల్చుకున్నాయి. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్ ఎన్నికల ఫలితాలను తిరస్కరించారు. ఎన్నికల్లో ప్రారంభం నుంచి తమకు అన్ యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాడు తూనే ఉంటుందని వెల్లడించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు ఇలా ఎందుకొచ్చాయో తెలుసుకు నేందుకు లోతుగా అధ్యయనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications