లోక్‌సభలో అడుగుపెడతా.. మోదీని కడిగేస్తా : లాలూ ప్రసాద్ యాదవ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్. దేశంలో బీజేపీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు చెప్పే మోసపూరిత హామీలను విని విని యూపీ ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.
యూపీలో బీజేపీ ఓటమి తథ్యం
యూపీలో బీజేపీకి ఒక స్పష్టమైన విధానం లేదని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. కాషాయ పార్టీకి కావావల్సిందల్లా ఎంత సేపూ మతం, అల్లర్లు, గుళ్లు, గోపురాలు వంటివి తప్ప.. విద్య, వైద్యం, పేదలు, రైతులు, ఉద్యోగాలు వంటి వాటిని పట్టించు కోవడంలేదంటూ దుయ్యబట్టారు. బీహార్‌లో ఆర్జేడీ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగానే లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యోగి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో తన మిత్రుడు ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ కూటమి అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

లోక్‌సభలో అడుగుపెడతా.. మోదీకి కౌంటర్ ఇస్తా..
అటు ప్రధాని నరేంద్ర మోదీపై లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మోదీ పాలనలో పేదలకు ఒరిగిందేమి లేదన్నారు. బడాబాబులకే మోదీ వత్తాసు పలుకుతున్నారని సామాన్యులను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు లాలూ చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోర్టు నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందన్నారు. అనుమతి రాగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. లోక్ సభలో అడుగుపెట్టి.. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న మోదీకి సరైన కౌంటర్ ఇస్తానని చెప్పారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎంతకాలం పదవిలో ఉంటారో చెప్పలేమన్నారు. ఆయన జట్టు ఇప్పుడు బీజేపీ చేతిలో ఉందంటూ సెటైర్లు విసిరారు లాలూ..
BJP is going to lose in Uttar Pradesh. People in the state are tired of BJP's propaganda. They have only been talking about riots, religion and temple... Nitish Kumar can go to any extent to stay on the chair of Chief Minister of Bihar: RJD chief Lalu Prasad Yadav pic.twitter.com/rNv83d0I9v
— ANI (@ANI) February 8, 2022












Click it and Unblock the Notifications