పట్టపగలే ఎమ్మెల్యే హత్య: మాజీ ఎంపీకి జీవిత ఖైదు

ఆర్జేడీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ హజారీబాగ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1995నాటి ఎమ్మెల్యే అశోక్ సింగ్ హత్య కేసులో ఇటీవల ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు..

పాట్నా: ఆర్జేడీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ హజారీబాగ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1995నాటి ఎమ్మెల్యే అశోక్ సింగ్ హత్య కేసులో ఇటీవల ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు.. మంగళవారం తుది తీర్పు వెలవరించింది.

ఈ కేసును విచారించిన జిల్లా అదనపు న్యాయమూర్తి సురేంద్ర శర్మ... ప్రభునాథ్ సింగ్‌తో పాటు ఆయన సోదరుడు దీననాథ్ సింగ్, మాజీ సర్పంచ్ రితేశ్ సింగ్‌లకు కూడా జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.

RJD's Prabhunath Singh sentenced to life imprisonment in Ashok Singh murder case

1995లో అప్పటి మార్సఖ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్ సింగ్ హత్య జరిగింది. పట్టపగలు ఆయన నివాసంవద్దే దుండగులు అశోక్‌సింగ్‌ను కాల్చిచంపారు. 1997లో పాట్నా హైకోర్టు ఈ కేసును పాట్నా నుంచి హజారీబాగ్‌కు బదిలీ చేసింది. నిందితుడు ప్రభునాథ్ సింగ్.. ఎంపీగా, ఎమ్మెల్యేగా మహారాజ్‌గంజ్, మార్సాఖ్ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించారు. అంతేగాక, ఆర్జేడీ అధినేత లూలూకు అత్యంత సన్నిహితుడు కూడా.

కాగా, దిగువకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ప్రభునాథ్ సోదరుడు పేర్కొన్నారు. ప్రస్తుతం హజారీబాగ్ కేంద్ర కర్మాగారంలో కస్టడీలో ఉన్న ప్రభునాథ్ సహా ఇతరులను వారం రోజుల క్రితమే కోర్టు నిందితులుగా తేల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+