వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్కే నగర్ పోలింగ్ ప్రశాంతం: ఓటింగ్ సరళిపై ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

Recommended Video

RK Nagar Bypoll Updates ఆర్కే నగర్ ఉపఎన్నిక ఓటింగ్ ప్రారంభం !

చెన్నై: అర్కె నగర్‌ ఉప ఎన్నిక పోలింగు గురువారంనాడు ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సరళిపైనే పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. 2జి కేసులో అనుకూల తీర్పు రావడంతో డిఎంకె వర్గాల్లో ఉత్సాహం పెరిగింది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక గురువారం జరుగుతోంది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటింగ్ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. డీఎంకే అభ్యర్థి గణేశ్‌, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్‌ తొలి గంటలోనే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

కాగా, అన్నాడీఎం ఎమ్మెల్యే అభ్యర్తి మధుసూదన్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. దేవుడితోపాటు అమ్మ(జయలలిత) ఆశీస్సులు తనకే ఉన్నాయని చెప్పారు.

2.80 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డీఎంకే అభ్యర్థి మరుదుగణేశ్‌, అన్నాడీఎంకే అభ్యర్థి ఇ మధుసూదన్‌, అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్‌, బీజేపీ నేత కరు నాగరాజన్‌లు మధ్యే ప్రధానంగా ఉన్నారు.

ప్రధాన పోటీ మరుదుగణేశ్‌, దినకరన్‌, ఇ. మధుసూదన్‌ల మధ్యనే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. 208 పోలింగ్‌ బూత్‌లున్న ఈ నియోజకవర్గంలో 200 సీసీ కెమరాలు ఏర్పాటు చేసి పోలింగ్‌ సరళిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది.

దినకరన్‌దే విజయం: సుబ్రమణ్యస్వామి సంచలనం

అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్‌కే ఓటేయాలని ఇప్పటికే పిలుపునిచ్చిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. ఈ ఎన్నికల్లో విజయం ఆయనదేనని జోస్యం చెప్పారు. ఢిల్లీలో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల పరాజయం ఖాయమైపోయిందన్నారు. సీఎం ఎడప్పాడి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంలకు పరాభవం తప్పదని అన్నారు.

English summary
Residents of RK Nagar, a constituency in northern Chennai, will start filing into polling centres at 8 AM today to elect the MLA who will succeed J Jayalalithaa in the Tamil Nadu Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X