త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా, ఎవరికీ మద్దతివ్వను: విశాల్
చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికలో తన నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో రాజకీయాల్లో తన తర్వాతి అడుగు గురించి త్వరలో ప్రకటిస్తానని సినీ నటుడు విశాల్ అన్నారు. ఉప ఎన్నికలో పోటీ అనేది తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు.

అధికార రాజకీయాల వల్లే తన నామినేషన్ తిరస్కరణకు గురైందని ఆరోపించారు. ప్రజా సేవలో తాను కొనసాగుతానని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాను ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టంచేశారు.
ఉప ఎన్నికపై కాకుండా ఓఖీ తుపాను బాధితులపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు. జయలలిత మృతితో ఖాళీ ఏర్పడిన ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక బరిలో స్వతంత్ర అభ్యర్థిగా విశాల్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తప్పులు దొర్లియాంటూ విశాల్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.












Click it and Unblock the Notifications