ఆర్ కే నగర్ లో శశికళ వర్గంపై చెప్పులతో దాడి: మీరా అమ్మ వారసులు !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా అక్కడ టీటీవీ దినకరన్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి వెళ్లిన శశికళ వర్గంలోని నాయకురాలు, సినీనటి సీఆర్. సరస్వతి తదితరుల మీద స్థానికులు చెప్పులు, టమోటోలు, రాళ్లతో దాడి.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి చేదు అనుభవం ఎదురైయ్యింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికికి వెళ్లిన సమయంలో స్థానికులు తిరగబడి శశికళ వర్గంపై చెప్పులు, టమోటోలు, రాళ్లతో దాడి చెయ్యడంతో ఉద్రిక్తపరిస్థితి ఎదురైయ్యింది.
జయలలిత మరణంలో ఖాళీ అయిన ఆర్ కే నగర్ లో ఈనెల 12వ తేదిన ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్నాడీఎంకే పార్టీలోని శశికళ వర్గం నుంచి ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి (శశికళ వర్గం), సినీ నటి సీఆర్. సరస్వతి దినకరన్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు.

శుక్రవారం రాత్రి ఆర్ కే నగర్ నియోజక వర్గంలో దినకరన్ కు మద్దతుగా ఆమె ప్రచారం చెయ్యడానికి వెళ్లారు. ఆ సమయంలో సీఆర్. సరస్వతి మీద కొందరు చెప్పులు, టమోటోలు, రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
మా నియోజక వర్గాన్ని అమ్మ జయలలిత ఎంతో అభివృద్ది చేశారని, అమ్మ మరణించిన తరువాత మమ్మల్ని పట్టించుకునేనాథుడే కరువయ్యాడని, ఇప్పుడు అమ్మ వారసులు మేమే అంటూ ఇక్కడికి వచ్చి ఎలా ప్రచారం చేస్తారని స్థానికులు సీఆర్. సరస్వతిని నిలదీశారు.
శశికళ వర్గీయులు మళ్లీ ప్రచారం చెయ్యడానికి పోలీసులు అవకాశం ఇవ్వకపోవడంతో సీఆర్. సరస్వతితో పాటు మిగిలిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దెబ్బతో శశికళ వర్గీయులు ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ప్రచారం చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications