నాడు అద్వానీని అరెస్ట్ చేసిన ఆర్కే సింగ్, ఇప్పుడు మోడీ కేబినెట్లో
26 ఆరేళ్ల క్రితం బిజెపి అగ్రనేత ఎల్‌కే అద్వానీ రథయాత్ర బీహార్‌లోకి అడుగు పెట్టినప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. అద్వానీ అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు.
న్యూఢిల్లీ: 26 ఆరేళ్ల క్రితం బిజెపి అగ్రనేత ఎల్‌కే అద్వానీ రథయాత్ర బీహార్‌లోకి అడుగు పెట్టినప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. అద్వానీ అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు.
అద్వానీ అరెస్టు బాధ్యతను ఇద్దరు అధికారులకు అప్పగించారు. గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు నాడు అద్వానీ రథయాత్ర చేశారు. ఈ సమయంలో రాజ్ కుమార్ సింగ్‌తో పాటు మరో అధికారికి అరెస్టు బాధ్యతలు అప్పగించారు.

అద్వానీని అరెస్ట్ చేసిన ఆర్కే సింగ్ ఇప్పుడు కేంద్రమంత్రి
అదే రాజ్ కుమార్ సింగ్ (ఆర్కే సింగ్) ఈ రోజు (ఆదివారం) కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను ప్రధాని మోడీ తన కేబినెట్లోకి తీసుకున్నారు.

అప్పుడు ఆర్కేసింగ్ బీహార్ ఐఏఎస్ అధికారి
అక్టోబర్ 1990లో ఆర్కే సింగ్ ఐఏఎస్ ఆఫీసర్. బీహార్ ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆర్కే సింగ్ పాట్నా నుంచి సమస్తిపూర్‌కు వెళ్లారు. ఆయన వెంట ఐపీఎల్ ఆఫీసర్ రామేశ్వర్ ఓరాన్ కూడా ఉన్నారు. అద్వానీ ఉన్న సర్క్కూట్ హౌజ్‌కు వెళ్లి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ అయిందని చెప్పింది ఆర్కే సింగే. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అద్వానీ తీసుకొని మళ్లీ పాట్నా వెళ్లారు.

బిజెపి తలరాతను మార్చిన యాత్ర
ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న మసాంజర్ గెస్ట్ హౌజ్‌కు అద్వానీని తరలించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ అద్వానీ చేసిన ఈ రథయాత్రే బిజెపి రాతను మార్చిన విషయం తెలిసిందే.

అద్వానీ ఎంపీ.. ఆర్కే సింగ్ మంత్రి
ఈ రథయాత్ర ముగిసిన ఆరేళ్ల తర్వాత తొలిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటయింది. అద్వానీ డిప్యూటీ ఉప ప్రధానిగా, హోంమంత్రి అయ్యారు. ఇప్పుడు అద్వానీ కేవలం ఎంపీ పదవికే పరిమితమవగా ఆయను అప్పట్లో అరెస్ట్ చేసిన ఆర్కే సింగ్ మంత్రి అయ్యారు.

2014 ఎన్నికలకు ముంది బిజెపిలోకి
1975 బ్యాచ్ బీహార్ కేడర్ ఆఫీసర్ అయిన రాజ్ కుమార్ సింగ్ యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు. 2014 ఎన్నికల ముందు బిజెపిలో చేరారు. బీహార్‌లోని ఆరా నుంచి లోకసభకు పోటీ చేసి గెలిచారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications