గుడికి వెళ్తుండగానే కానరాని లోకాలకు.. ఐదుగురు మృతి, 10 మందికి తీవ్రగాయాలు !!
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కానీ పండుగ ఆనందాల మధ్య జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. వ్యాన్ లో గుడికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అదుపు తప్పి వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే..?
సిరోజ్ జిల్లాకు చెందిన కొందరు మకర సంక్రాంతి సందర్భంగా నర్మదాపురం లోని ప్రసిద్ధ గుడిని దర్శించుకునేందుకు వ్యాన్‌లో బయలుదేరారు. అయితే భోపాల్ జిల్లా బెరాసియా ప్రాంతం వద్దకు రాగానే.. ఎదురుగా అధిక వేగంతో వచ్చిన ట్రాక్టర్ అదుపుతప్పి వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు వ్యాన్ పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

అలాగే గాయపడిన పది మందిలో మహిళలు, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సేవలకు సమాచారం అందించారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. వ్యాన్‌లో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని భోపాల్‌లోని హమీదియా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో దెబ్బతిన్న వాహనాలను రహదారి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్రమంగా పునరుద్ధరించారు. మృతులందరూ సిరోజ్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు నిర్ధారించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంక్రాంతి పండుగ సమయంలో ఈ ప్రమాదం జరగడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించే అవకాశంపై అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications