వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ కోర్టులో రాబర్ట్ వాద్రాకు ఊరట : అమెరికా, నెదర్లాండ్ వెళ్లేందుకు ఓకే .. ఇంగ్లాండ్‌కు మాత్రం నో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు సీబీఐ స్పెషల్ కోర్టులో కాస్త ఊరట లభించింది. ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది. కానీ ఇంగ్లాండ్ మాత్రం వెళ్లొద్దని కండీషన్ పెట్టింది. లండన్‌లో విలాసవంతమైన భవనం కొనుగోలులో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్టు వాద్రాపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాబర్ట్ వాద్రాను విచారించింది. మనీ ల్యాండరింగి కేసులు ఏప్రిల్ 1న కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

చికిత్స కోసం ..
మనీ ల్యాండరింగ్ కేసులో బెయిల్‌పై బయట ఉన్న వాద్రా .. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ స్పెషల్ కోర్టును ఆశ్రయించింది. తన పెద్ద పేగులో కణితి ఏర్పడిందిన లండన్‌లో చికిత్స తీసుకుంటానని పిటిషన్‌లో కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న వాద్రా .. విదేశాల్లో చికిత్స చేయించుకునేందుకు కోర్టు అంగీకరించింది. అమెరికా, నెదర్లాండ్ వెళ్లేందుకు మాత్రంం అనుమతిచ్చింది. ఇంగ్లాండ్ వెళ్లొద్దని షరతు విధించింది.

Robert Vadra allowed to travel abroad for treatment, but cannot go to London

ఆరువారాల పాటు అమెరికా, నెదర్లాండ్‌లో చికిత్స చేయించుకొని తిరిగి భారత్ రావాలని స్పష్టంచేసింది. తన అనారోగ్యానికి సంబంధించి ఢిల్లీలోని సర్ గంగారం హాస్పిటల్‌లో వాద్రా పరీక్షలు చేయించుకున్నారు. వారు కణితి ఉందని చెప్పడంతో .. తదుపరి చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలని వాద్రా నిర్ణయించారు. ఈ మేరకు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన కోరిక మేరకు లండన్‌లో చికిత్సకు మాత్రం కోర్టు నో చెప్పింది.

English summary
in a relief to Robert Vadra, a CBI Special Court on Monday allowed Vadra to travel to the United States and the Netherlands for treatment. Vadra, brother-in-law of Congress president Rahul Gandhi is an accused in a money-laundering case. However, the court has not granted permission to Vadra to travel to London as he is facing investigation by the Enforcement Directorate in connection with his London properties and his association with arms dealer Sanjay Bhandari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X