భారత్ సాయంతో నిర్మించిన ఆఫ్ఘన్ పార్లమెంటుపై రాకెట్లతో ఉగ్రదాడి

కాబుల్: ఆఫ్గన్ రాజధాని కాబూల్‌లో భారత ప్రభుత్వం ఆర్థిక సహకారంతో నిర్మించిన పార్లమెంటు భవంతిపై సోమవారం నాడు ఉగ్రవాదులు రాకెట్ దాడి చేశారు. ఈ భవనాన్ని గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రారంభించారు.

ఈ దాడిలో జరిగిన ప్రాణనష్టం గురించిన సమాచారం తెలియరాలేదు. తేలికపాటి రాకెట్‌ను సమీపం నుంచి పార్లమెంటు మీదికి తాలిబాన్ ఉగ్రవాదులు ప్రయోగించారని తెలుస్తోంది. పార్లమెంటును చుట్టుముట్టిన ఆఫ్గన్ భద్రతా దళాలు, మరో దాడి జరగకుండా చర్యలు చేపట్టారు. సైన్యం ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతోంది.

Rocket attack at Afghan Parliament, no casualties reported

ఆప్ఘన్ కొత్త పార్లమెంటు భవనాన్ని రూ.1000 కోట్లతో నిర్మించారు. 2007లో ప్రారంభమైన భవన నిర్మాణం 2015 చివరి నాటికి పూర్తయింది. ఈ భవనం నిర్మాణానికి ఏడేళ్ల సమయం పట్టింది. అందుకే భారత ప్రధానిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనతో ఈ పార్లమెంటు భవననాన్ని ప్రారంభింపచేశారు.

ఎగువ సభలో 192 సీట్ల సామర్థ్యం ఉండగా, దిగువ సభలో 294 మంది సభ్యులు పార్లమెంటులో కూర్చునే వీలు ఉంది. అదే సమయంలో మన దేశ సహకారంతో నిర్మింతమైన ఈ భవనానికి అటల్ బ్లాక్‌గా పేరు పెట్టడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+