కూతుర్ని చంపి జైలుకెళ్లిన తల్లి: జైల్లో 3రోజుల పసికందునూ..
రోహ్‌తక్: ఓ తల్లి తన కర్కశత్వాన్ని చాటుకుంది. ఏడాది వయస్సున్న కూతుర్ను చంపి జైలుకెళ్లిన ఓ మహిళ.. జైలులో మరో కూతరును చంపేసింది. ఈ దారుణ ఘటన హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలో చోటు చేసుకుంది. తల్లి చేతిలో హత్యకు గురైన రెండో చిన్నారి వయస్సు కేవలం మూడు రోజులేనని జైలు అధికారులు తెలిపారు.
ఏడాది వయస్సున్న మొదటి కూతురును హత్య చేసిన నిందితురాలిని జనవరి 9న అరెస్ట్ చేశామని చెప్పారు. ఆ సమయంలో నిందితురాలు గర్భవతని తెలిపారు. బాధితురాలి అత్త ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
కాగా, మూడు రోజుల క్రితం మరో కూతురుకు బాధితురాలిని జన్మనిచ్చిందని తెలిపారు. జైలులోనే ఆ పందును కూడా నిందితురాలు హత్య చేసిందని పోలీసులు తెలిపారు. మంగళవారం నిందితురాలిని కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

గ్వాలియర్‌లో స్వైన్‌ఫ్లూ: శిశువుతో ఇద్దరు మృతి
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్వైన్‌ఫ్లూ వల్ల ఓ శిశువుతోపాటు ఇద్దరు మృతి చెందారు. ఈ విషయాన్ని అక్కడి వైద్య, ఆరోగ్యాధికారి అనుప్ కమతాన్ తెలిపారు. కమ్లరాజ్ ఆస్పత్రిలో సోమవారం రాత్రి పుట్టిన శిశువు మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహాన్ని పరీక్షించిన అనంతరం స్వైన్‌ఫ్లూ మరణించిన వైద్యాధికారులు ధృవీకరించారు. శిశువు తల్లిని ప్రత్యేకవార్డులో ఉంచినట్లు చెప్పారు. మరో ఇద్దరు కూడా స్వైన్ ఫ్లూతో మృతి చెందారని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications