• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife: తండ్రి పోలీసు, కొడుకు క్రిమినల్, ముగ్గురు భార్యలు, చేతిలో కోట్లు, పది ముక్కలు, రెండో భార్య స్కెచ్ !

|

చెన్నై/ చెంగల్పట్టు: పోలీసు కొడుకు అయిన వ్యక్తి నేరసామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, లూటీలు ఇలా అనేక క్రిమినల్ కేసులు నమోదు కావడంతో పేరుమోసిన రౌడీషీటర్ల జాబితాలోకి వెళ్లాడు. అప్పుడప్పుడు జైలు నుంచి బయటకు వస్తున్న మనోడు ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు మొగుడైనాడు. ఇటీవల ఓ రాజకీయ పార్టీ నాయకుడి అవతారం ఎత్తిన రౌడీషీటర్ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఆశపడి కోటి రుపాయల విలువైన ఆస్తిని విక్రయించి చేతిలో డబ్బులు పెట్టుకున్నాడు. ఏ పని చేసినా తండ్రి సమాధి నుంచి మొదలు పెట్టే ఆ రౌడీషీటర్ ను రెండో భార్య సహాయంతో ప్రత్యర్థులు అదే స్మశానంలో ముక్కలు ముక్కలుగా నరికి శవాన్ని అర్దం తగలబెట్టడం కలకలం రేపింది. 2021 కొత్త సంవత్సరంలోకి నువ్వు అడుగుపెట్టలేవు అని చాలెంజ్ చేసిన ప్రత్యర్థులు చెప్పిన మాట నిలబెట్టుకుని వారం రోజుల ముందే అతని లేపేశారు.

Girlfriend: మేడమ్ కు భర్త, సార్ కు భార్య లేరు, రాత్రి ఎంజాయ్ చేసి ఇనుపరాడ్ తో, అప్పుడు లేని భయం !

 పేరుమోసిన రౌడీషీటర్

పేరుమోసిన రౌడీషీటర్

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా, తిరుపోరూరు సమీపంలోని కొండగి మలేయూర్ గ్రామానికి చెందిన చంద్రన్ పోలీసు శాఖలో ఉద్యోగం చేసేవాడు. చంద్రన్ కుమారుడు సతీష్ కుమార్ అలియాస్ రౌడీ సతీష్ (39). సతీష్ మీద తిరుపోరూరు, కేలంబక్కం, మామల్లాపురం, వేలాచ్చేరి వండలూరు తదితర పోలీస్ స్టేషన్లలో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, లూటీలు ఇలా అనేక క్రిమినల్ కేసులు నమోదు కావడంతో పేరుమోసిన రౌడీషీటర్ల జాబితాలోకి సతీష్ పేరు వెళ్లిపోయింది.

 తండ్రి నిజాయితీ పరుడు

తండ్రి నిజాయితీ పరుడు

పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న చంద్రన్ కొడుకు సతీష్ మీద అనేక క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అతను పదేపదే జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. పై పోలీసు అధికారులు చంద్రన్ ను పిలిచి నీ కొడుకు సతీష్ కుమార్ కు బుద్దిమాటలు చెప్పాలని సూచించారు. కొడుకు సతీష్ కు బుద్దిమాటలు చెప్పి చెప్పి విసిగిపోయి, హెడ్ కానిస్టేబుల్ చంద్రన్ చివరికి అతన్ని వదిలేశాడు. కొంత కాలం క్రితం అనారోగ్యంతో చంద్రన్ కన్ను మూశాడు.

 మనోడికి మూడు పెళ్లిళ్లు

మనోడికి మూడు పెళ్లిళ్లు

సతీష్ పదేపదే జైలుకు వెళ్లి వస్తున్న సమయంలో ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సతీష్ మొదటి భార్య అతన్ని పూర్తిగా వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయి వేరుగా నివాసం ఉంటున్నది. తరువాత సతీష్ లక్ష్మి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మిని పెళ్లి చేసుకున్న తరువాత మరో యువతిని సతీష్ పెళ్లి చేసుకున్నాడు.

 ఫ్రెండ్ ను చంపి అతని భార్యతో పెళ్లి

ఫ్రెండ్ ను చంపి అతని భార్యతో పెళ్లి

లక్ష్మికి అంతకు ముందే పెళ్లి జరిగింది. సతీష్, లక్ష్మి భర్త స్నేహితులు. సినిమా స్టైల్లో లక్ష్మి మొదటి భర్తను హత్య చేసిన సతీష్ జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చిన సతీష్ లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. తన భర్తను సతీష్ హత్య చెయ్యడానికి లక్ష్మి కూడా సహకరించిందని అప్పట్లో కేసు నమోదైయ్యింది. ఈ కేసు ఇంకా కలాంబక్కం కోర్టులో విచారణ పెండింగ్ లో ఉందని పోలీసులు అన్నారు. లక్ష్మి మీద మోజుతోనే ఆమె మొదటి భర్తను హత్య చేసి ఆమెను సతీష్ లొంగదీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

 తండ్రి సమాధి పక్కనే ముక్కలుగా నరికేశారు

తండ్రి సమాధి పక్కనే ముక్కలుగా నరికేశారు

మలేయూర్ గ్రామం సమీపంలోని స్మశానంలో సతీష్ తండ్రి చంద్రన్ సమాధి ఉంది. తండ్రి సమాధి దగ్గర పూజ చెయ్యడానికి సతీష్ కారులో వెళ్లాడు. అదే సమయం కోసం వేచి చూసిన ప్రత్యర్థులు సతీష్ ను పట్టుకుని అతని తల, కాళ్లు, చేతులు, మెడ తదితర అవయవాలు ముక్కలు ముక్కలుగా నరికేసి సమీపంలోని బ్యారేజ్ లో విసిరేశారు. సతీష్ మొండెం మాత్రం అతని తండ్రి చంద్రన్ సమాధి పక్కనే పెట్రోల్ పోసి అర్దం శవం కాలిపోయే వరకు తగలబెట్టి పరారైనారు.

 కేసులు ఎత్తేయాలని పిటీషన్

కేసులు ఎత్తేయాలని పిటీషన్

తాను రౌడియిజం మానేసి బుద్దిగా బతుకుతానని, తన మీద ఉన్న రౌడీషీట్ పేరును తొలగించాలని ఇదే సంవత్సరం సతీష్ పోలీసు అధికారులకు పిటిషన్ పెట్టుకున్నాడు. తరువాత తమిళనాడులో ఓ రాజకీయ పార్టీ నాయకులతో తిరుగుతున్న సతీష్ అమ్ముకా ప్రాంతంలో వ్యాపారం మొదలు పెట్టాడు. వ్యాపారం చేస్తున్న సతీష్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు.

 చేతిలో కోటి రూపాయల డబ్బు, రెండో భార్య స్కెచ్ ?

చేతిలో కోటి రూపాయల డబ్బు, రెండో భార్య స్కెచ్ ?

మలేయూర్ శాసన సభ నియోజక వర్గంలోని పంచాయితీ చైర్మన్ పదవికి పోటీ చెయ్యాలని డిసైడ్ అయిన సతీష్ ఎన్నికల ఖర్చు కోసం ఇటీవల ఓ స్థలం విక్రయించి చేతిలో కోటి రూపాయలకు పైగా డబ్బులు పెట్టుకున్నాడు. సతీష్ ఏ పని మొదలు పెట్టిన అతని తండ్రి చంద్రన్ సమాధి దగ్గర పూజ చేసి ప్రారంభించడం ఆనవాయితీ అని పోలీసులు అన్నారు. సతీష్ వీక్ నెస్ అసరా చేసుకున్న ప్రత్యర్థులు అతన్ని తండ్రి సమాధి దగ్గరే దారుణంగా హత్య చేశారని పోలీసులు అంటున్నారు. సతీష్ హత్య కేసులో అతని రెండో భార్య లక్ష్మీ మీద పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొందరు నువ్వు 2021 సంవత్సరం చూడలేవు అని సతీష్ తో చాలెంజ్ చేశారని, కొత్త సంవత్సరం వారం రోజుల ముందే అతని పక్కాప్లాన్ తో చంపేశారని అతని వర్గీయులు ఆరోపిస్తున్నారు.

English summary
Rowdy: Chengalpattu rowdy murder brutally due to prejudice in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X