గ్రామ్య బ్యాంకులో రూ.1.15కోట్ల పెద్ద నోట్లను దోచేశారు
భువనేశ్వర్: ఒరిస్సాలోని ఒడిశా గ్రామ్య బ్యాంక్‌లో రూ. కోటికి పైగా పాతనోట్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. శని, ఆది వారాలు సెలవు అనంతరం సోమవారం ఉదయం బ్యాంక్ తెరచిన అధికారులు ఈ విషయాన్ని గ్రహించారు.
బ్యాంకులో మొత్తం రూ.8 కోట్ల పాత కరెన్సీ నోట్లు వున్నాయి. వాటిలో రూ.1.15 కోట్లు ఉన్న ఒక ఐరన్ బాక్స్ కనపడకపోవడాన్ని బ్యాంకు అధికారులు గుర్తించారు. ఆ బాక్స్‌లో అన్నీ రూ.500, రూ.1000 నోట్లే ఉన్నాయి. ఈ మేరకు డెంకనల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా డెంకనల్ ఎస్పీ బసంత్ మాట్లాడుతూ.. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, జమ్మూ కాశ్మీర్‌లోని ఒక బ్యాంకులోకి అనుమానిత ఉగ్రవాదులు చొరబడి సుమారు రూ. 11లక్షలకు పైగా రద్దయిన పెద్దనోట్లను సోమవారం ఉదయం అపహరించుకుపోయారు.












Click it and Unblock the Notifications