costly gifts:లక్ష నగదు, బంగారం, వెండి, కర్ణాటక మంత్రి ఇలా..
దివాళి పండగ సందర్భంగా గిప్ట్స్, స్వీట్స్ ఇస్తుంటారు. కొందరు వ్యాపార వేత్తలు బైకులు, కార్లు అందజేశారు. అదీ కూడా కొందరికీ ఇచ్చేశారు. అవీ వార్తల్లో నిలిచాయి. ఇక నేతలు/ అధికారులు కూడా మిఠాయి షేర్ చేస్తారు. కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్ మాత్రం డిఫరెంట్.. తన నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి కాస్ట్లీ గిప్ట్స్ అందజేశారు. మరొసారి వార్తల్లో నిలిచారు.
ఆనంద్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి విలువైన బహుమతులను అందజేశారు. అందులో రూ. లక్ష నగదు, 144 గ్రాముల బంగారం, కిలో వెండి, సిల్క్ శారీ, ధోతి, డ్రై ఫ్రూట్ బాక్స్ ఉన్నాయి. ఇంత కాస్ల్టీ గిప్ట్ పంపించి.. తన అభిమానాన్ని చాటుకున్నారు. కానీ కాంట్రవర్సీ అయ్యింది.

పైన చెప్పిన గిప్టులు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినవారికి అందజేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి మాత్రం అందులో తక్కువ నగదు పెట్టారట. అలాగే బంగారం పెట్టలేదట.. కానీ మిగతా ఐటెమ్స్ మాత్రం కామన్‌గా ఉన్నాయి. సాక్షాత్ మంత్రి ఖరీదైన వస్తువులను బహుమతులను అందజేశారు. దీంతో వివాదాస్పదం అవుతుంది. ఇదీ బసవరాజు బొమ్మై సర్కార్‌ను ఇరుకున పెట్టేస్తోంది.












Click it and Unblock the Notifications