రూ.17 కోట్ల నగదు: వ్యాపారి ఇంటి వద్ద సీజ్.. ఏం జరిగిందంటే..?
మొబైల్ గేమింగ్ యాప్‌తో మోసం చేస్తోన్న వ్యాపారి ఇంటి వద్ద ఈడీ దాడులు నిర్వహించింది. ఆరు చోట్ల ఏకకాలంతో దాడులు చేసింది. బ్యాంకు అధికారులతో కలిసి కోల్ కతాలో రైడ్ చేసింది.గార్డెన్ రీచ్ ఏరియాకు చెందిన వ్యాపారి అమీర్ ఖాన్ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. కడపటి సమాచారం అందేవరకు రూ.17 కోట్ల నగదును సీజ్ చేశారు. నగదును కౌంటింగ్ మిషన్ల ద్వారా లెక్కింపు ప్రక్రియను చేపడుతున్నారు.

ఇప్పటికే ఆ వ్యాపారి ఇంటి వద్దకు కొన్ని ట్రక్స్ చేరుకున్నాయి. ఆ నగదును తరలించే ప్రక్రియను చేపడుతున్నారు. ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర బలగాలను మొహరించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతో భద్రత చర్యలను తీసుకున్నారు. స్థానిక పోలీసులు కూడా వారికి సహకారం అందిస్తున్నారు.
ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు. ఈ నగ్లెట్స్ అనే మొబైల్ గేమింగ్ యాప్ వినియోగదారులను మోసం చేసేందుకు వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈడీ దాడులు చేస్తోంది.ఇలా నగదు సమకూర్చారట. వ్యాపారి ఇంటి వద్ద మాత్రం భారీగా నగదు పట్టుబడింది. ఇంకా నగదు లెక్కింపు ప్రక్రియను చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications