ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం: రూ. 2వేల నోట్లు సీజ్!
శ్రీనగర్: కాశ్మీర్‌లోని బందిపొర సెక్టార్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ ప్రాంతంలో మరింతమంది ఉగ్రవాదులు తలదాచుకునే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆర్మీ విసృత గాలింపు చేపట్టింది. కాగా, హతమైన ఉగ్రవాదులు వద్ద కొత్తగా విడుదలైన రూ. 2వేల నోట్లు లభ్యమైనట్లు తెలిసింది.

హతమైన ఉగ్రవాదుల వద్ద కొత్తగా వచ్చిన రూ. 2వేల నోట్లతోపాటు పాత రూ.1000 నోట్లను కూడా భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. వీటితోపాటు రెండు ఏకే-47 తుపాకుల, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులకు కొత్త నోట్లను ఎవరో అందించి ఉంటారని ఆర్మీ అధికారులు చెప్పారు.
పాక్ జాతీయుడి కాల్చివేత
ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో పాక్ జాతీయుడుచొరబాటుకు యత్నించాడు. అతడిని గమనించిన సైన్యం కాల్చి చంపేసింది.












Click it and Unblock the Notifications