వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురి ప్రాణాలు తీసిన రూ.20 వేల అప్పు: అదిలా మొదలైంది...

వాళ్లు ముగ్గురు స్నేహితులు.. అంతేకాదు స్నేహితులు కూడా. కానీ గతవారం వారంతా హత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ కంటోన్మెంట్‌లో జరిగింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

భోపాల్: వాళ్లు ముగ్గురు స్నేహితులు.. అంతేకాదు స్నేహితులు కూడా. కానీ గతవారం వారంతా హత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ కంటోన్మెంట్‌లో జరిగింది. ఆ ముగ్గురు కాలిపోయిన స్థితిలో పోలీసులకు దొరకడం వారినే కాదు యావత్ గుణ కంటోన్మెంట్ వాసుల వళ్లు గగుర్పొడిచే ఘటన ఇది.

రూ.20 వేల అప్పు తీసుకున్న 11వ తరగతి విద్యార్థి, తనను అప్పుకట్టమన్న స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని తలపోశాడు. మరో ఇద్దరు సహచర విద్యార్థులతో కలిసి ప్లాన్ వేశాడు. కడతేర్చాడు. మిగతా ఇద్దరూ తన ప్లాన్ ఎక్కడ చెప్తారేమోనని వారిని పై లోకాలకు పంపేశాడు.

మే 18న ఇలా కథ మొదలైంది

మే 18వ తేదీన గుణ కంటోన్మెంట్ వాసి, 11వ తరగతి విద్యార్థి హేమంత్ మీనా కనిపించకుండా పోవడంతో అసలు కథ మొదలైంది. మోటార్ బైక్ కొనుగోలు చేసేందుకు ఇంట్లో నుంచి రూ.40 వేలు తీసుకుని వెళ్లి తమ కొడుకు తిరిగి ఇంటికి రాలేదని హేమంత్ మీనా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టిన తర్వాత ఒకటి తర్వాత మరొక ఘటన సంచలనం స్రుష్టించాయి. చివరకు అనుమానంతో 11వ తరగతి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు కథ బయట పడింది.

Rs 20,000 loan, 3 charred bodies, Class 11 suspect: Murders that shook MP’s Guna

ఇలా హత్యల పరంపర

హేమంత్ మీనా, మరో ముగ్గురు అంతా 17 ఏళ్లలోపు వారే. హేమంత్ మీనా కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో అతడి స్నేహితులను పోలీసులు ప్రశ్నించారు. 25వ తేదీన ఒకరి మ్రుతదేహం గుణ కంటోన్మెంట్ శివారుల్లో సగం కాలిపోయిన స్థితిలో పోలీసులకు దొరికింది. మరో రెండు రోజులకు ఇంకొక మిత్రుడి మ్రుతదేహం రైల్వే వంతెన వద్ద లభించింది. తాజాగా మూడు రోజుల క్రితం (ఆదివారం) మరో మ్రుతదేహం లభించడంతో పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దిగ్భ్రాంతికి గురి కావడం పోలీసు అధికారుల వంతైంది.

హత్యలకు ఇవీ కారణాలు

దిగువ మధ్య తరగతి వర్గానికి చెందిన ప్రధాన నిందితుడి తండ్రి లేడు. కొన్నేళ్లుగా గుణ కంటోన్మెంట్‌లో జీవిస్తున్నారని గుణ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎఎస్పీ) సత్యేంద్ర తోమర్ తెలిపారు. ప్రధాన నిందితుడికి హేమంత్ మీనా రూ.20 వేల అప్పు ఇచ్చాడు. అయితే ఆ రుణం తీర్చాలని విద్యార్థులందరిలో నిలదీయడంతో ప్రధాన నిందితుడికి కోపం వచ్చింది. ప్రతీకారం తీర్చుకోవాలని ప్రణాళిక రూపొందించాడు. ఈ నెల 18న పార్టీ చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మరో ఇద్దరు స్నేహితులకూ పురమాయించాడు. అదే రోజు కంటోన్మెంట్ శివారుల్లోకి వెళ్లి మందు కొట్టారు. తర్వాత అతడి గొంతు నులిమి చంపేశారు. అతడి వద్ద ఉన్న రూ.40 వేల నగదు కొట్టేశారు. తర్వాత అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

హేమంత్ హత్య తర్వాత ఇలా..

ఆ ముగ్గురు అంతటితో ఆగక మరో ప్లాన్ వేశారు. హేమంత్ మీనా కుటుంబం నుంచి రూ.50 లక్షలు గుంజాలని నిర్ణయించుకున్నారు. వారిలో ఒకరు ఇండోర్‌కు వెళ్లాడు. హేమంత్ మీనా కుటుంబానికి ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇస్తే హేమంత్ మీనాను పంపిస్తామని బెదిరించాడు. కానీ ఆ విషయం చెప్పకుండా వచ్చేయడంతో ప్రధాన నిందితుడికి, అతడికి మధ్య మాటామాటా పెరిగింది. ఆ కోపంలో అతడ్ని చంపి, తగులబెట్టి రైల్వే వంతెన వద్ద వదిలేసి వచ్చినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. మరో రెండు రోజులకు మూడో విద్యార్థిని మట్టుబెట్టాడని ఎఎస్పీ సత్యేంద్ర తోమర్ తెలిపారు.

English summary
Three friends, who were neighbours, were all murdered last week, police say. When three badly charred bodies surfaced in Madhya Pradesh’s Guna town over the last week, police knew they were onto something.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X