ముంబైలో భారీ చోరీ: వీడియో తీసి విడిచిపెట్టారు

వివరాల్లోకి వెళితే.. కారులో వచ్చని ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు జునాగర్‌లోని విశాల్ జువెల్లర్స్‌లో ప్రవేశించారు. తుపాకీ, కత్తులను చూపించిన దుండగులు దుకాణ ఉద్యోగులను బెదిరింపులకు గురి చేసి ఆభరణాలను దోచుకెళ్లారు. కాగా దుకాణంలోని కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు దొంగతనంలో స్థానికంగా నివాసముండే వ్యక్తులే పాల్గొన్నట్లు తెలిపారు. అయితే వారి పేర్లను తెలిపేందుకు నిరాకరించారు.
దుకాణంలోని ఓ ఉద్యోగి కపిల్ మంగిలాల్ పరిహార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగతనానికి పాల్పడిన వారిలో 25 నుంచి 30ఏళ్ల వయస్సు ఉన్న వారున్నారని తన ఫిర్యాదులో పరిహార్ పేర్కొన్నాడు. రాత్రి 9.10 గంటలకు ముగ్గురు వ్యక్తులు మంకీ క్యాప్‌లను ధరించి దుకాణంలోకి దూసుకొచ్చారని, ఆయుధాలతో తమను బెదరించారని తెలిపాడు.
30 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారని తెలిపారు. ముగ్గురు లోపలికి వచ్చిన సమయంలో మరొక దుండగుడు దుకాణం ముందు ఉన్నాడని, ఇంకొకరు కారులో ఉన్నారని చెప్పాడు. కౌంటర్‌లోని 5వేల రూపాయలను కూడా దోచుకెళ్లారని తెలిపాడు. దొంగతనమంతా దుకాణంలోని సిసి కెమెరాల్లో రికార్డు అయి ఉందని పేర్కొన్నాడు. కాగా ఐపిసి 395, 427, రెడ్ విత్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 3,4,27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications